ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఊపిరి వచ్చింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆయనకు మధ్యంత బెయిల్ ఇస్తూ.. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నేడు ఉత్తర్వులు అందిన నాటి నుంచి జూన్ 1వతేదీ వరకు ఆయన బెయిల్‌పై ఉండొచ్చని తీర్పు చెప్పింది. అయితే.. ఈ క్రమంలో కొన్ని షరతులు విధించింది. ముఖ్యమంత్రిగా ఎలాంటి బాధ్యతలు నిర్వహించరాదని తేల్చి చెప్పింది. ముఖ్య మంత్రిగా అదికారులతో సమీక్షలు చేయడం.. సంతకాలు చేయడం.. ఆదేశాలు ఇవ్వడం చేయరాదని పేర్కొంది.
బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలకు మాత్రమే కేజ్రీవాల్ పరిమితం కావాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. జూన్ 2వ తేదీన స్వచ్ఛందంగా అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశించిం ది. దీంతో సుదీర్ఘ విరామం.. న్యాయపోరాటం తర్వాత.. సుప్రీంకోర్టు నుంచి కేజ్రీవాల్‌కు బెయిల్ లభించ డం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణంలో ముందు సాక్షిగా.. తర్వాత.. నిందితుడిగా పేర్కొన్న సీబీఐ, ఈడీలు.. తర్వాత.. తర్వాత. ఉచ్చు బిగించాయి.
కేజ్రీవాలే అసలు ప్రధాన నిందితుడని సీబీఐ పేర్కొంది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ మాస్టర్ మైండ్ అని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయనను మార్చి 21న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తర్వాత.. తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. అప్పటి నుంచి కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయకుండానే జైలు జీవితం గడిపారు. ఇప్పటి వరకు ఎవరూ సీఎంగా ఉండి జైల్లో ఉన్నవారు లేరు. ఇక, ఎన్నికలు జరుగుతున్నాయని.. కీలక మైన ఎన్నికల్లోతాను ప్రచారం చేసుకోవాల్సి ఉందని పేర్కొంటూ కేజ్రీవాల్ ఢిల్లీ కోర్టును, రౌస్ ఎవెన్యూ కోర్టును గతంలో అభ్యర్థించారు.
కానీ, ఆయా కోర్టులు తిరస్కరించారు. దీంతో సుప్రీంకోర్టు ఆశ్రయించారు. సీబీఐ వద్దని పేర్కొంది. అంతేకాదు.. దేశంలో చట్టం.. అందరికీ సమానమేనని.. ముఖ్యమంత్రి విషయంలో అరెస్టు ఒకవిధంగా.. సామాన్యుల విషయంలో మరోలా వ్యవహరించలేమని పేర్కొంది. మొత్తానికి విచారణ ఉత్కంఠగా మారినా.. సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం గమనార్హం.
This post was last modified on May 10, 2024 3:12 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…