ఏపీలోని జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన లేఖ రాసింది. ఒక్కసారిగా ప్రభుత్వానికి ఇంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అని ప్రశ్నించింది. అంతేకాదు.. దీనికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలలోగా సమాధానం చెప్పాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ మళ్లీ లేఖ రాయడం సంచలనంగా మారింది. అంతేకాదు.. లబ్ధి దారులకు ఈ రోజే(శుక్రవారం) నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందో వివరించాలని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యాదీవెన.. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, చేయూత, ఆసరా పధకాలకు సంబంధించిన నిధుల పంపణీ వ్యవహారం.. ప్రభుత్వానికి-కేంద్ర ఎన్నికల సంఘానికి మధ్య వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ నిధులు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే.. ఇవి ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలని.. కాబట్టి పంపిణీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది.
ఈ క్రమంలో సుదీర్ఘ విచారణ తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం తన మనసు మార్చుకుని.. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాత.. పంపిణీ చేయొచ్చని తేల్చి చెప్పింది. అయితే.. ప్రభుత్వ వాదనలు విన్న హైకోర్టు.. 10వ తేదీ ఒక్కరోజు వరకు సర్కారుకు అనుమతి ఇస్తూ.. తీర్పు వెలువరించింది. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి పథకాల లబ్ధి దారులకు 14 వేల కోట్ల రూపాయల పంపిణీ ప్రారంభమైంది. దీంతో వైసీపీ కొంత సంతోషం వ్యక్తం చేసింది.
అయితే.. ఇంతలోనే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మరో లేఖ వచ్చింది. జనవరిలో బటన్ నొక్కిన పథకాలకు ఇప్పటి వరకు నగదు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తూ.. సుదీర్ఘ లేఖ రాసింది. అంతేకాదు.. సర్కారు.. ఆర్థిక పరిస్థితి చెప్పండని కూడా ఈసీ ప్రశ్నించింది. మరి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.
This post was last modified on May 10, 2024 6:42 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…