ఏపీలో మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుంది. ఐదేళ్ల పాలనకు సంబంధించిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఇప్పటి వరకు లేని విధంగా సెంటిమెంటు ఏపీని కుదిపేస్తోంది . సాధారణంగా రాష్ట్రాల్లోనూ.. కేంద్రంలోనూ ఎన్నికలంటే.. ప్రజల సమస్యలు, రాష్ట్రాల సమస్యలు తెరమీదికి వస్తాయి. వాటిపైనా రాజకీయ పార్టీలు ఫోకస్ చేస్తుంటాయి. మేం అభివృద్ది పరుగులు పెట్టిస్తామంటే.. కాదు.. మేం ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఒకప్పుడు రాజకీయాల్లో చర్చ జరిగేది.
కానీ, ఏపీలో మాత్రంఈ దఫా ఎన్నికలు.. నేరాలు-హత్యలు-అవమానాల సెంటిమెంట్ల చుట్టూనే తిరుగుతోంది. అలాగని అభివృద్ది-సంక్షేమాల గురించిన చర్చ లేదా? అంటే.. ఉంది. కానీ, అది కేవలం 10 శాతమే. మిగిలిన 90 శాతం కూడా.. నేరాలు-హత్యలు-అవమానాల చుట్టూ తిరుగుతోంది. దీనిలో ప్రతిపక్షా లు.. ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. మా బాబాయిని హత్య చేసిన వారికి ఓటేస్తారా? అంటూ.. షర్మిల.. నా తండ్రిని చంపిన వారికి ఓటేస్తారా? అంటూ.. సునీతలు ప్రచారం చేస్తున్నారు.
ఎక్కడ అడుగు పెట్టినా.. ఏ వేదిక ఎక్కినా.. షర్మిల కీలక అంశంగా వివేకా దారుణ హత్యను అస్త్రంగా చేసుకున్నారు. కడప దాటి బయటకు వస్తే.. అనంతబాబు.. తన డ్రైవర్‌ను హత్యచేసి డోర్ డెలివరీ చేసిన ఘటనను, డాక్టర్ సుధాకర్‌పై పోలీసులు చేసిన దాష్టీకాన్ని షర్మిల ప్రశ్నిస్తున్నారు. ఇవే ప్రచార అస్త్రాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు తన కుటుంబాన్ని అడ్డంగా అవమానించారని.. తన భార్యను తిట్టారని గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కూడా ఇదే జాబితాలో చేరారు. తన సోదరి నారా భువనేశ్వరిని అడ్డంగా విమర్శించిన వారికి ఓటుతో జవాబు చెప్పాలని అంటున్నారు. వైసీపీ నేతలు రౌడీలుగా మారారని.. వారికి ఓటుతో బుద్ది చెప్పాలని.. తాము అధికారంలోకి రాగానే.. తాటతీసి.. కొట్టి కింద కూర్చోబెడతామని.. బట్టలు ఊడదీసి ఊరేగిస్తామని కూడా.. పవన్ చెబుతున్నారు. రాష్ట్రంలో రౌడీలు, మాఫియాలు పెరిగిపోయారని.. ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అసలు సీఎం జగన్ సొంత జిల్లా కడపలోనే శాంతి భద్రతలకు దిక్కులేకుండా పోయిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ విమర్శిస్తున్నారు.
వైసీపీ మాటేంటి?
అందరూ కలిసి గుండుగుత్తగా తనపై యుద్ధానికి వస్తున్నారన్నది సీఎం జగన్ చెబుతున్న మాట. తను ఇంత చేశానని.. చంద్రబాబు ఏం చేశాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలు ఏం చేశామో చెప్పుకోలేని వారు.. ఇప్పుడు మరోసారిఓట్ల కోసం వచ్చి మోసం చేస్తున్నారని అంటున్నారు. ఇతమిత్థంగా చూస్తే.. ఏ పార్టీ కూడా. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అజెండా చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. హోదా సాధిస్తామని, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూస్తామని.. కడప స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని.. చెబుతున్న పార్టీలు కనిపించడం లేదు. ఎలా చూసుకున్నా.. ఏపీ ప్రజలు ఒక గందరగోళ స్థితిలో అయితే ఉన్నారు. మరి ఎలాంటి తీర్పు చెబుతారో చూడాలి.
This post was last modified on May 11, 2024 10:24 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…