Political News

వాలంటీర్ల‌కు ఫోన్లు, బైక్‌లు.. ఓట్ల కోసం వైసీపీ వ్యూహం!

ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌నే అధికార దాహంతో ఉన్న వైసీపీ దేనికైనా తెగించేందుకు వెనుకాడ‌టం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఓట్లు పొందేందుకు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు, నాయ‌కుల‌పై దాడులతో పాటు జ‌నాల‌ను మ‌భ్య పెడుతూ వైసీపీ సాగుతోంద‌నే టాక్ ఉంది. ఇక వాలంటీర్ల‌నే ప్ర‌ధానంగా న‌మ్ముకున్న వైసీపీ వాళ్ల‌తో ఓట్లు పొందేందుకు వ్యూహాలు అమ‌లు చేస్తుంద‌ని తెలిసింది. వాలంటీర్ల‌తో ప్ర‌చారం చేయించొద్ద‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించినా వైసీపీ ప‌ట్టించుకోవ‌డం లేదు. కొంత‌మంది వాలంటీర్ల‌పై ఈసీ వేటు వేసినా మార్పు రాలేదు. అదీ కాకుండా కొంత‌మంది వాలంటీర్లు ఉద్యోగాలు వ‌దిలేసి వైసీపీకి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

వాలంటీర్లే వైసీపీకి ఉన్న ప్ర‌ధాన దిక్కు అని చెప్పాలి. గ్రామ‌స్థాయిలో ఒక్కో వాలంటీర్‌కు 50 ఇళ్ల వ‌ర‌కూ తెలుసు. ఆ ఇంట్లో వాళ్ల‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే ఓట్ల వేట‌కు ఈ వాలంటీర్ల‌ను ప్ర‌ధాన అస్త్రంగా వైసీపీ వాడుతోంద‌ని తెలిసింది.  ఆ పార్టీ అభ్య‌ర్థులు ఈ వాలంటీర్ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌వుతున్నారు. న‌గ‌దు, వివిధ బ‌హుమ‌తుల‌తో వాలంటీర్ల‌ను మ‌భ్య పెడుతున్నార‌ని స‌మాచారం. వాలంటీర్ల‌కు వైసీపీ నాయ‌కులు పెద్ద మొత్తంలో డ‌బ్బు ఇస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఖ‌రీదైన ఫోన్ల‌ను బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్లు తెలిసింది.

ఇక కోస్తా జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గంలో వాలంటీర్ల‌కు బైక్‌లు ఇచ్చేందుకూ వైసీపీ నాయ‌కులు సిద్ధ‌మ‌య్యార‌ని తెలిసింది. త‌మ విజ‌యం కోసం ప‌ని చేయాల‌ని, గెలిచిన వెంట‌నే బైక్‌లు కొనిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వాలంటీర్ల‌నూ వైసీపీ బాగా వాడుకుంటోంది. ఆయా గ్రామాల్లో వీళ్ల‌తో ప్ర‌చారాన్ని కొన‌సాగిస్తోంది. జ‌గ‌న్ మ‌ళ్లీ గెల‌వ‌క‌పోతే సంక్షేమ ప‌థ‌కాలు ఆగిపోతాయ‌ని, చంద్ర‌బాబు అధికారంలో వ‌స్తే ఎలాంటి ప్ర‌యోజనం ద‌క్క‌ద‌ని జ‌నాలకు ఈ వాలంటీర్లు చెబుతున్న‌ట్లు టాక్‌. 

This post was last modified on May 10, 2024 8:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…

42 minutes ago

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

2 hours ago

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…

2 hours ago

నటి రేప్ కేసు – హీరోపై కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…

2 hours ago

అర్ధరాత్రి షోలు…150 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

3 hours ago