Political News

20 లక్షల ఉద్యోగాలు వచ్చాయి-జగన్

ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకుని ఎన్నికలకు వెళ్తున్నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఐతే 2019 ఎన్నికల ముంగిట ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చానని పదే పదే జగన్ చెప్పుకుంటుంటే.. జగన్ విస్మరించిన హామీలంటూ ఆయన ఒకప్పుడు చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోలనే షేర్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ప్రతిపక్షాలు.

జగన్ మాట తప్పిన హామీల్లో ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం, మెగా డీఎస్సీ నిర్వహించడం.. లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం ప్రధానమైనవి. ఈ హామీని జగన్ నిలుపుకోలేకపోయాడన్నది స్పష్టం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తిగా జగన్ విస్మరించాడని.. అదే సమయంలో కొత్త పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేటులోనూ ఉపాధి అవకాశాలు దెబ్బ తిన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఐతే సచివాలయ ఉద్యోగులకు తోడు వాలంటీర్లను, ప్రభుత్వంలో విలీనం అయిన ఆర్టీసీ ఉద్యోగులను కూడా కలిపేసి ఆరున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చామని జగన్ సర్కారు ఘనంగా ప్రకటనలు ఇచ్చుకోవడంపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది చాలదన్నట్లు తాజగా ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో జగన్ ఉద్యోగాల కల్పన గురించి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తోంది. తమ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలకు తోడు.. అదనంగా ఎంఎస్ఎంఈల ద్వారానే 20 లక్షల మందికి ఉపాధి దొరికిందని జగన్ ఘనంగా ప్రకటించుకోవడం గమనార్హం.

ఈ మాట అనగానే ఇంటర్వ్యూయర్.. “20 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో” అని నొక్కి చెప్పగా “ఎస్.. ఎస్..’ అంటూ జగన్ ఇంకా బలంగా ఈ మాటను చెప్పడం విశేషం. ఐతే అధికారిక గణాంకాలు లేకుండా నోటి మాటగా 20 లక్షల మందికి ఉపాధి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేయడంతో ఏపీ సీఎంపై సోషల్ మీడియాలో గట్టిగా ట్రోలింగ్ జరుగుతోంది.

This post was last modified on May 9, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

3 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

6 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

7 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

7 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

9 hours ago