Political News

గోనె వారి స‌ర్వే… కూట‌మి వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. లెక్క తేల్చేశారు!

గోనె ప్ర‌కాశరావు. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయ‌కుడు.. ఒక‌ప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి మిత్రుడు. తాజాగా ఈయ‌న ఏపీ పాలిటిక్స్‌పై సంచ‌ల‌న స‌ర్వే అంటూ ఒక‌టి విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈయ‌న తెలంగాణ‌లో ఉంటున్నారు. మ‌రి ఆయ‌న‌కు ఏపీలో ఎక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందో తెలియ‌దు కానీ.. తాను మాత్రం తెలుసుకున్న‌ట్టు వివ‌రించారు. స‌రే.. ఎన్నిక‌ల వేళ ఏదైనా హాట్ టాపిక్కే క‌దా! సో.. ఇప్పుడు గోనెవారి స‌ర్వే కూడా.. సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తోంది.

ఇంత‌కీ గోనె ప్ర‌కాశ రావు చెప్పిన లెక్క ప్ర‌కారం.. ఏపీలో కూట‌మికి తిరుగులేదు.. వైసీపీకి గెలుపు లేద‌నే! వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోతుంద‌ని గోనె తెలిపారు. ముఖ్యంగా వైసీపీకి కంచుకోట వంటి సీమ‌లో 52 స్థానాలు(అసెంబ్లీ) ఉంటే.. ఇక్క‌డ‌.. ఆ పార్టీకి కేవలం 22-28 సీట్లు వ‌స్తాయ‌ని కూట‌మికి ఏకంగా 24-26 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. నిజానికి ఇక్క‌డ క‌నుక కూట‌మి ఇన్ని సీట్లు తెచ్చ‌కుంటే.. మిగిలిన రెండు ప్రాంతాల్లో ఆ పార్టీకి తిరుగులేదు.

ఇదే విష‌యాన్ని గోనె చెప్పారు. కూట‌మి కొన్నికొన్నిజిల్లాల‌ను క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. అంతేకాదు.. ఏకంగా భారీ మెజారిటీ కూడా ద‌క్కించుకునే స్థానాలు ఉన్నాయ‌న్నారు. విజ‌య‌వాడ వెస్ట్‌లో ల‌క్ష మెజారిటీ వ‌చ్చినా.. బీజేపీ ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. విజ‌య‌వాడ ఎంపీ సీటు టీడీపీదేన‌న్నారు. క‌డ‌ప‌లో ష‌ర్మిల గెలుపు ప‌క్కా అని తేల్చేశారు. మొత్తంగా కూట‌మికి 19-21 పార్ల‌మెంటు స్థానాలు, 125-143 అసెంబ్లీ స్థానాలు ద‌క్కుతాయ‌ని గోనె చెప్పారు.

జిల్లాల వారీగా ఇలా..

  • సీమ‌లో 52 స్థానాల‌కు గాను కూట‌మి 24, వైసీపీ 22-28 చోట్ల విజ‌యం ద‌క్కించుకుంటుంది.
  • ఉత్తరాంధ్రలో 34 సీట్లకు గాను కూట‌మి 28, వైసీపీ 5 చోట్ల ప‌క్కా గెలుస్తుంద‌న్నారు.
  • ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 సీట్లలో కూట‌మి 31, వైసీపీ 2-3, ఇత‌రులు 1 ద‌క్కించుకుంటారు.
  • కృష్ణ-గుంటూరు జిల్లాల్లోని 33 సీట్ల‌లో 25 -29 కూట‌మి, 3-5 మ‌ధ్య‌లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది.
  • ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని 22 స్థానాల్లో కూటమికి 15 ఖ‌చ్చితంగా వ‌స్తాయి. 5-6 వైసీపీ, 1-2 ఇత‌రుల‌కు వ‌చ్చే చాన్స్ ఉంది.

This post was last modified on May 9, 2024 3:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

54 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago