ఏపీలో జరుగుతున్న సార్వత్రిక సమరం.. ఓ రేంజ్‌లో హీటు పుట్టిస్తోంది. ప్రధాన పక్షాలైన.. టీడీపీ, వైసీపీ, జనసేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు కూటమి.. మరోవైపు వైసీపీలు దూకుడుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే.. ఇంత జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం మౌనంగా ఉంది. ఒకరిద్దరు మినహా.. ఎవరూ ముందుకు రాలేదు. ఎవరికీ మద్దతు చెప్పలేదు. గతంలో అయితే.. ఎంతో కొంత మార్పు ఉండేది. కానీ, ఇప్పుడు అసలు పూ్ర్తిగా మౌనం వహించారు.
అయితే.. ఎన్నికలకు పట్టుమని ఆరు రోజులు ఉన్న సమయంలో మెగా స్టార్ స్పందించారు. తన తమ్ము డికి తాను మద్దతిస్తున్నానని చెప్పిన ఆయన పిఠాపురంలో జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న పవన్ కల్యాణ్ ను గెలిపించాలని కోరారు. వాస్తవానికి.. ఫిజికల్‌గానే పవన్ కోసం చిరు ప్రచారం చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ, వీడియో సందేశం ఇచ్చారు. తన తమ్ముడు శ్రమ పడుతున్నాడని.. రేపు ఎమ్మెల్యేగా గెలిస్తే.. పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పారు.
మెగా వీడియో భారీ ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వెంటనే టాలీవుడ్ కదలింది. చిన్నపాటి హీరోలు.. ముందుకు వచ్చారు. తాము పవన్‌కు మద్దతిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. హీరో నాని.. ట్వీట్ చేస్తూ.. రాజకీయంగా మీరు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన కుటుంబంగా మీరు అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారు. మీకు రాజకీయాల్లోనూ మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను.. అని పేర్కొన్నారు.
మరి హీరో.. రాజ్ తరణ్ కూడా.. పవన్‌కు జైకొట్టారు. తొలి రోజు నుంచి నేను అన్నీ గమనిస్తున్నాను. మీ దూర దృష్టి, కృషి వంటివి ఏపీకి అవసరం. లక్షల మందిలో ఒకడిగా నేను కూడా మీపై పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తారని నమ్ముతున్నా. ప్రజల భవిష్యత్తు మార్చేందుకు మీరు వేసిన అడుగు నిజం కావాలని ఆశిస్తున్నా
అని పేర్కొన్నాడు. సో.. మొత్తంగా టాలీవుడ్ అయితే.. కదలింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on May 7, 2024 3:39 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…