Political News

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులకు షాక్‌లు ఇస్తోంది. ఇప్పటికే రెండంకెల సంఖ్యలో అధికారులు బదిలీ అయ్యారు. వారిలో చాలామంది అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే. వారిలో ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నది రెండేళ్లుగా డీజీపీగా వ్యవహరిస్తున్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డినే. ఈయనపై చర్యలు చేపట్టాలని చాలా రోజులుగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు ఆదివారం నాడు రాజేంద్రనాథ్‌ను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక్క రోజు వ్యవధలోనే కొత్త డీజీపీ నియామకం కూడా జరిగిపోయింది. ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు (ఆర్టీసీ ఎండీ), మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తాల పేర్లను సిఫారసు చేయగా.. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేరును ఎన్నికల సంఘం డీజీపీగా ఖరారు చేసింది.

కాగా ఇదే సమయంలో అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డి మీద ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన మీద ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇలా గత మూడు వారాల్లో చాలామంది వివాదాస్పద అధికారులపై ఈసీ వేటు వేసింది. ఇక ప్రతిపక్షాలు కోరుకుంటున్న బదిలీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిదే. ఆయన మీద కూడా అనేక ఆరోపణలున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన మీద కూడా వేటు పడితే ఎన్డీయే కూటమి ప్రశాంతంగా ఎన్నికలకు వెళ్లొచ్చు.

This post was last modified on May 6, 2024 6:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమీర్ ఖాన్ చెప్పింది వినడానికి బాగుంది కానీ

మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా సినిమాను చూసే విధానం, థియేటర్ రన్ అయ్యాక దాన్ని ఓటిటికి ఇచ్చే పద్ధతుల్లో కానీ చాలా…

25 minutes ago

నాని ‘హిట్’ ఫార్ములా – ఒక కేస్ స్టడీ

ఒక ఏ రేటెడ్ వయొలెంట్ సినిమాకు మొదటి రోజు నలభై మూడు కోట్లు రావడం చిన్న విషయం కాదు. మూడు…

1 hour ago

విశ్వక్ మిస్సయ్యాడు….ఫ్యాన్స్ ఫీలయ్యారు

హిట్ 3 ది థర్డ్ కేస్ లో అడవి శేష్ క్యామియో ఉందనేది ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే స్టంట్…

3 hours ago

వైసీపీ ‘ష‌ఫిలింగ్’ పాలిటిక్స్ స‌క్సెస్ అయ్యేనా..?

గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీచేసిన ప్ర‌యోగాల గురించి అంద‌రికీ తెలిసిందే. ఒక‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాయ‌కుల‌ను మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి…

3 hours ago

వార్ 2 వ్యాపారం ఇప్పుడప్పుడే కాదు

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా మూవీ వార్ 2 విడుదల ఇంకో నూటా పది…

3 hours ago

ఆదిపురుష్ దర్శకుడి విచిత్ర వాదం

కొందరు దర్శకులకు తాము తీసింది ఫ్లాపని ఒప్పుకోవాలంటే మహా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక సాకు చెప్పి తాము తీసింది…

5 hours ago