ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో రాజకీయాలు ఘాటెక్కాయి.. హీటెక్కాయి! నాయ కులు.. పార్టీలు.. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నా రు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ రాజకీయాలు ఈ ఎన్నికలు.. కుటుంబాల్లో కల్లోలం రేపుతున్నాయి. ఆత్మీయ బంధాలను కూడా తెగ్గొడుతున్నాయి. దీంతో కుటుంబ వ్యవస్థపైనా.. రాజకీయాలు ప్రభావం చూపుతున్నాయా? అంటున్నారు పరిశీలకులు.
ఉదాహరణకు కొన్ని ఘటనలు తీసుకుంటే.. సీఎం జగన్ వర్సెస్ వెఎస్ షర్మిల.. వ్యవహారం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. షర్మిల ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. వ్యక్తిగత విమర్శల వరకు కూడా వెళ్లింది. ‘అద్దం పంపిస్తాను.. ముఖం చూసుకో’ అనే వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక, భారతి అంతా మానిటర్ చేస్తున్నారంటూ.. సీఎం భార్యపైనా విమర్శలు గుప్పించారు. దుర్మార్గుడు.. హంతకుల కు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఇక, విజయవాడ నుంచి బరిలో ఉన్న అన్నదమ్ములు.. కేశినేని నాని-కేశినేని చిన్నిల గురించి చెప్పుకొం టే చాలా తక్కువనే అనిపిస్తుంది. నాని వైసీపీ నుంచి చిన్ని టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఒక తల్లి బిడ్డలే. కానీ, ఇప్పుడు.. నిప్పులు చెరుగుతున్నారు. ఏం రేంజ్‌లో అంటే.. చిన్నిని నాని 420 అంటే.. నానీని చిన్ని దుర్మార్గుడు.. హంతకుల పంచన చేరాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. నానీ చిన్నీని దోపిడీదారు.. అంటే.. చిన్నీ.. నానీని అక్రమాలు చేశాడు.. అవినీతి చేశాడు.. ప్రజలను మోసం చేసి టికెట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తిన్నాడని.. ముఠాకోర్ అంటూ.. వ్యాఖ్యలు చేశారు.
అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వైసీపీ సీనియర్ నాయకుడు బూడి ముత్యాల నాయుడు.. పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు ఇప్పుడు యాంటీ అయ్యాడు. తాను స్వయంగా మాడుగుల నియోజకవర్గం నుంచి తన సోదరి(బూడి రెండో భార్య కుమార్తె)పై ఇండిపెండెంటుగా పోటీ చేస్తున్నాడు. అంతేకాదు.. అటు తండ్రి అక్రమాలు.. అన్యాయాలు.. తదితర విషయాలను రోజూ చెబుతున్నారు. తన తండ్రి, చెల్లిని ఓడించాలంటూ.. ఆయన పిలుపునిస్తున్నాడు.
ఇక, ముద్రగడ కుటుంబంలో ఆయన కుమార్తె క్రాంతి భారతి తెరమీదికి వచ్చి.. తన తండ్రిని నమ్మొద్దని కాపులకు పిలుపునిచ్చింది. తన తండ్రిని జగన్ వాడుకుంటున్నాడని చెప్పింది. ఇక, ముద్రగడ.. అసలు తన కూతురు ఇప్పుడు తన ఆస్తి కాదన్నారు. ఇప్పుడుతాజాగా మంత్రి అంబటి అల్లుడు గౌత్ తెరమీదికి వచ్చాడు. మామపై తీవ్ర విమర్శలు చేశాడు. నికృష్ణుడు.. నీచుడు.. అంటూ ఊహించని విధంగా విమర్శలు చేశాడు. ఓటేయొద్దని పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. : రాజకీయాల్లో ఇవి కామనే.. అని అనుకున్నా.. ఇంత దారుణమైన వ్యవహారాలతో రాజకీయాలు చేసుకుంటే.. రేపు కుటుంబ బంధాలు నిలుస్తాయా? అన్నది ప్రశ్న. లేక.. కుటుంబాలు కూడా.. రాజకీయాల్లాగా.. అవసరం ఉన్నప్పుడు.. నానా మాటలు తిట్టేసుకుని.. అవకాశం కోసం కలిసిపోయినట్టు .. కలిసిపోతాయా? అనేది చూడాలి. ఏదేమైనా.. ఇది ఓటర్లపై ప్రభావం చూపిస్తుందా? లేదా? అన్నది చూడాలి.
This post was last modified on May 6, 2024 7:18 am
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…