రాయ్ బరేలీ నుండి పోటీకి దిగుతుంది అనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ ఎందుకు పోటీ చేయలేదు ? అక్కడి నుండి ఆమె పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడినా అమె ఎందుకు బరిలోకి దిగలేదు ? ప్రియాంక స్థానంలో రాహుల్ ఎందుకు పోటీకి దిగాడు ? అంటే దీని వెనక కుట్ర ఉంది అంటున్నాడు కాంగ్రెస్ బహిష్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్.
ఈ మేరకు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక గాంధీపై పార్టీలో కుట్ర జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీ త్వరలో చీలి పోతుందని, రాహుల్ గాంధీ వర్గం, ప్రియాంక గాంధీ వర్గాలుగా చీలిపోవడం ఖాయమని అంటున్నారు.
రాహుల్ గాంధీ అమేథీ నియోజకవర్గాన్ని వీడిన తీరు కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసిందని, ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో జూన్ 4 తర్వాత ఆమె మద్దతుదారుల గుండెల్లో ఆవేదన అగ్నిపర్వతంలా బద్దలవ్వడం ఖాయమని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ అన్నారు.
ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరని నేను ముందే చెప్పానని, ప్రియాంక గాంధీపై కుటుంబంలో, పార్టీలో భారీ కుట్ర జరుగుతోందని ఆయన అంటున్నారు.
రాహుల్ గాంధీకి పాకిస్థాన్‌లో ప్రజాదరణ బాగుందని, ఆయన రాయ్‌బరేలీకి బదులుగా పాక్‌లోని రావల్పిండి నుంచి పోటీ చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశాడు.
This post was last modified on May 5, 2024 11:12 am
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…