Political News

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కూడా కేటాయించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పార్టీ తొలుత కోర్టుకు వెళ్లింది. దీనిపై ఎన్నిక‌ల సంఘం వివ‌రణ ఇస్తూ.. కొంత మార్పు చేసింది. జ‌న‌సేన పోటీ చేసే 21 అసెంబ్లీ స‌హా.. 2 పార్ల‌మెంటు స్థానాల్లోనూ.. ఎవ‌రికీ గాజు గ్లాసు గుర్తును కేటాయించ‌బోమ‌ని పేర్కొంది. దీంతో హైకోర్టు కేసును మూసేసింది.

ఇదేదో బాగుంద‌ని.. జ‌న‌సేన నాయ‌కులు త‌లూపుతూ.. బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.. టీడీపీ, బీజేపీ నేత‌లు ఎదురె ళ్లారు. గాజు గ్లాసు గుర్తును టీడీపీ, బీజేపీ నాయ‌కులు పోటీ చేసే 164 అసెంబ్లీ, 23 పార్ల‌మెంటు స్థానాల్లో స్వ‌తంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించార‌ని… సో.. ఓట‌రు త‌డ‌బ‌డితే అది త‌మ‌కొంప మునిగిపోయే ప‌రిస్థితికి దారితీస్తుంద‌ని ఆ రెండు పార్టీలు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ వెంటనే.. అంటే బుధ‌వారం రాత్రి వేళ హైకోర్టులో మ‌రో పిటిష‌న్ వేశారు.

దీనిలో టీడీపీ, బీజేపీ నేత‌లు కూడా క‌లిశారు. రాష్ట్రంలో జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ కూట‌మిగా వెళ్తున్న నేప థ్యంలో రాష్ట్రంలో ఎక్క‌డా ఎవ‌రికీ.. గాజు గ్లాసు గుర్తును కేటాయించొద్ద‌ని ఈ పార్టీలు పిటిష‌న్‌లో పేర్కొన్నా యి. తాజ‌గా దీనిపై హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా.. పై వాద‌న‌నే ఈ రెండు పార్టీల త‌ర‌ఫున న్యాయ‌వాదులు వినిపించారు. అయితే.. ఎన్నిక‌ల సంఘం మాత్రం భిన్న‌మైన వాద‌న వినిపించింది. దీంతో కోర్టుకు ఏం చేయాలో తెలియ‌క‌.. శుక్ర‌వారానికి కేసును వాయిదా వేసింది.

ఈసీ ఏమందంటే..

ఎన్నిక‌ల నామినేషన్ల ప్ర‌క్రియ ప్రారంభానికి ముందే.. పార్టీలు త‌మ‌కు ఉండే అభ్యంత‌రాలు చెప్పాలి. పైగా గాజు గ్లాసు అనేది ఫ్రీ సింబ‌ల్‌. దీనిని ఎవ‌రు కోరుకున్నా.. వారికి ముందుగా ఇచ్చే నిబంధ‌న‌లు ఉన్నాయి. పోనీ.. నిలుపుద‌ల చేయాల‌న్నా.. ముందు మ‌మ్మ‌ల్ని జ‌న‌సేన సంప్ర‌దించ‌లేదు. ఇప్ప‌టికే చాలా ఆల‌స్యం అయిపోయింది. ఇప్పుడు మార్పులు చేయ‌లేం. ఇప్ప‌టికే చాలా మందికి కేటాయించాం. సో.. ఇప్పుడు మార్చేందుకు కుద‌ర‌దు… అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. 

This post was last modified on May 2, 2024 6:08 pm

Share

Recent Posts

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

50 minutes ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

2 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

3 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

4 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

6 hours ago

గంప నిండా సినిమాలు… ఎక్కడయ్యా జనాలు

ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…

6 hours ago