తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న `సూపర్ సిక్స్`కు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. ఇదేసమయంలో మరికొన్ని హామీలను కూడా చేర్చారు. జర్నలిస్టులకు ఇళ్లు, కురబ సహా ఇతర సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక, సూపర్ సిక్స్‌లో ఉన్నవాటిని మరింతగా వివరించారు. అయితే.. ఈ మేనిఫెస్టోపై సీఎం జగన్ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఈ ప్రచార సభల్లోనే జగన్ స్పందిస్తూ.. కూటమి మేనిఫెస్టో అబద్ధాల కూర్పుగా ఉందని ఎద్దేవా చేశారు. పైగా కూటమి పార్టీల కు చెందిన ముగ్గురి ఫొటోలు మేనిఫెస్టోపై ఎందుకు లేవని ప్రశ్నించారు. “కూటమిగా మూడు పార్టీలు వెళ్తున్నాయి. కానీ.. మేని ఫెస్టోపై చంద్రబాబు, దత్తపుత్రిడి బొమ్మలే వేసుకున్నారు. మరి బీజేపీ తరఫున మోడీ బొమ్మను ఎందుకు వేయలేదు” అని ప్రశ్నించారు. అంతేకాదు.. దీనికి రీజన్ కూడా చెప్పారు. “ఈ మేనిఫెస్టో ఎలానూ అమలు చేసేది కాదని ప్రధాని మోడీకి తెలు సు. అందుకే తన ఫొటో వేయొద్దని చెప్పారు. అందుకే 12 గంటలకే మేనిఫెస్టో అంటూ.. ప్రకటించి మధ్యాహ్నం 3 గంటల వరకు సాగదీశారు. ఇలాంటి కూటమి రేపు ఏం చేస్తుందో మీరే ఆలోచించాలి” అని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.
అంతేకాదు.. మేనిఫెస్టో విడుదల సందర్భంగా తాను గణాంకాలు వివరించానని జగన్ చెప్పారు. గతంలో ఎంత ఆదాయం ఉంది.. ఇప్పుడు ఎంత మేరకు ప్రజలకు మేలు చేశామో వివరించామని తెలిపారు. కానీ, చంద్రబాబు తనను తిట్టడంతోనూ, శాపనార్థా లు పెట్టడంతోనూ సరిపెట్టారని జగన్ వ్యాఖ్యానించారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మరో రూ.10 పెంచి అమలు చేస్తున్న 40 ఇయర్ ఇండస్ట్రీఅంటూ.. చంద్రబాబును ఎద్దేవా చేశారు. తనకంటూ.. ఏమీ ప్రత్యేకత లేదని.. కాపీ కొట్టి మేనిఫెస్టో రూపొందించారని చెప్పారు. “ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకోలేకపోయారు. జగన్ మేనిఫెస్టో పెట్టి అమలు చేశాడు కాబట్టి వాటిపై ఓ రూపాయి ఎక్కువే ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఇవి సాధ్యమేనా?” అని జగన్ ప్రశ్నించారు.
This post was last modified on April 30, 2024 11:55 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…