రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ప్రియాంకాగాంధీ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అమేథి నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. 2004 నుండి సోనియాగాంధీ రాయ్ బరేలీ నుండి గెలుస్తూ వస్తున్నారు.
ఇటీవల రాజస్థాన్ నుండి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి గాంధీ కుటుంబం నుండి ప్రియాంక పోటీ చేస్తుందని భావించారు. ఈ మేరకు ప్రియాంక రాయ్ బరేలి, రాబర్ట్ వాద్రా అమేథి నుండి పోటీ చేయాలని పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే వాయనాడ్ లో ఎన్నికలు ముగియడంతో రాహుల్ అమేథి నుండి, ప్రియాంక రాయ్ బరేలి నుండి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి.
ప్రియాంకకు మాత్రం అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదని, ఆమె కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు వారసత్వ విమర్శల నుండి తప్పించుకునేందుకు పోటీకి దూరంగా ఉండడమే బావుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on April 30, 2024 7:17 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…