2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఈ క్రమంలో కూటమి గెలుపు ఖాయమని కూటమి నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. ఆల్రెడీ వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయగా ఈ రోజు కూటమి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ జాతీయ స్థాయి నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ లు సంయుక్తంగా విడుదల చేశారు.
“ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం…రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం” అనే నినాదంతో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది.
టీడీపీ సూపర్ సిక్స్, జనసేన షణ్ముఖ వ్యూహం, బీజేపీ పేర్కొన్న అంశాలను కలగలిపి మేనిఫెస్టో రూపొందించామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని, ప్రజలను గెలిపించేందుకే తాము కలిశామని చంద్రబాబు అన్నారు. కూటమికి రాష్ట్రంలో బీజేపీ సహకారం ఉందని, అందుకే సిద్ధార్థ నాథ్ సింగ్ నేరుగా వచ్చి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. బీజేపీ కూడా మేనిఫెస్టోకు కొన్ని సూచనలు చేసిందని, బీజేపీ కూడా ఈ మేనిఫెస్టోను ఎండార్స్ చేసిందని చెప్పారు.
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
మేనిఫెస్టోలోని కీలక అంశాలు
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లల్లో రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చు
బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్లు
బీసీ కార్పోరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేయడం
బీసీల స్వయం ఉపాధి కోసం ఏడాదికి రూ. 10 వేల కోట్లు
ఆధునిక పనిముట్లతో ఆదరణ పథకం అమలు
పవర్ లూం, హ్యాండ్ లూంలకు కొంత మేర ఉచిత విద్యుత్
మత్స్యకారులను ఆదుకునే కార్యక్రమాలు
డ్వాక్రా మహిళలకు రూ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
సంపద సృష్టిస్తాం.. ఆదాయాన్ని పంచుతాం
20 లక్షల మంది యువతకు ఉపాధి
నెలకు రూ. 3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో బిడ్డకు రూ. 15 వేలు
స్కిల్ గణన చేపడతాం
ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు
10 శాతం EWS రిజర్వేషన్ల అమలు
సమగ్ర ఇసుక విధానం
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు
కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేపడతాం
This post was last modified on April 30, 2024 7:27 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…