ఎన్నికల్లో వ్యూహాలు ఉండడం వేరు.. ఎదుటి పార్టీలను దెబ్బ కొట్టాలన్న కుయుక్తులు ఉండడం వేరు. వ్యూహాలు ఎన్నయినా.. ప్రత్యర్థులు ప్రతివ్యూహాలతో విరుచుకుపడే అవకాశం ఉంటుంది. దీంతో రాజకీ యాలు రాజకీయాలుగానే కొనసాగుతాయి. కానీ, కుయుక్తులు పన్ని.. ప్రత్యర్థులను దెబ్బతీసే వ్యూహాలు వేసినప్పుడు మాత్రం.. ఇబ్బందులు తప్పవు. ఇలాంటి రాజకీయాల్లో బీజేపీ ఆరితేరిపోయింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
అయితే.. ఇవి భౌతికంగా కొన్ని చోట్ల కనిపిస్తే.. లోపాయికారీగా మరికొన్ని చోట్ల కనిపిస్తోంది. ఇలాంటి వాటి నుంచి కాంగ్రెస్ బయట పడే పరిస్థితి లేకపోవడం గమనార్హం. అంటే.. ఎన్నికల్లో నామినేషన్లు వేసిన తర్వాత.. కూడా బీజేపీ తన రాజకీయలను కొనసాగిస్తోంది. కీలక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను నామినేషన్లు వేసిన తర్వాత కూడా.. లోబరుచుకుంటోంది. ఫలితంగా ఆయా నియోజకవర్గాల్లో అసలు పోటీ నే లేకుండా పోతోంది. బీజేపీ ఏకపక్షంగా విజయందక్కించుకుంటోంది.
మొన్న గుజరాత్ రాష్ట్రంలోని వజ్రాల వ్యాపారం జరిగే.. సూరత్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వేసిన నామినేషన్‌ను తిరస్కరించారు. ఆయనకు మద్దతుగా సంతకాలు చేసిన వారు.. సరిగా చేయలేదన్న కారణంతో ఆయనను పక్కన పెట్టారు. ఇదే నిజమని అనుకుంటే.. సదరు కాంగ్రెస్ అభ్యర్థి బయటకు వచ్చి.. ఆందోళన చేయాలి.. నిజానిజాలు తెలియజేయాలని కోరాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. సదరు అభ్యర్థి.. బ్రిటన్ పర్యటనకు వెళ్లిపోయారు. అంటే.. ఏం జరిగిందో అందరకి తెలుస్తోంది.
కట్ చేస్తే.. ఈ రోజు మధ్యప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన వస్త్ర వ్యాపారం ఇండోర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అబ్యర్థి అక్షయ్ కాంతి బమ్.. తన నామినేషన్‌ను ఎలాంటి కారణం లేకుండా వెనక్కి తీసుకున్నారు. అంతేకాదు.. దీనిని వెనక్కి తీసుకునేందుకు ఆయన కలెక్టర్ కార్యాలయానికి బీజేపీ నాయకులతో కలిసి వెళ్లారు. అనంతరం అటు నుంచి అటే.. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా ఇండోర్ కూడా.. దాదాపు ఏకపక్షంగా బీజేపీకి దక్కనుందన్న మాట.
This post was last modified on April 29, 2024 5:27 pm
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…