ఏపీ అధికార పార్టీ వైసీపీ గురించి.. నిన్న మొన్నటి వరకు ఉన్న టాక్ ఒకటి. మరోసారి జగన్ వచ్చేస్తున్నా రని.. కూటమివచ్చినా.. ఆయన గెలుపు ఖాయమని.. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. దీనికి కారణం కూటమిలో టికెట్ల కేటాయింపు నుంచి అభ్యర్థులను బరిలో నిలపడం వరకు పెద్ద ఎత్తున రగడ చోటు చేసుకోవడమే. అయితే. ఇది అయిపోయింది. ఇక, ఇప్పుడు వైసీపీ వంతు వచ్చింది. వైసీపీ వస్తే.. పేదల బతుకులు మారిపోతాయని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకున్నారు.
అందుకే అనేక కష్టాలకు ఓర్చుకుని కూడా.. 2019లో మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారని 99 శాతం పథకాలు అమలు చేశారని నాయకులు చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ కూడా మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. ఇక, కొత్త మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు.ఇక, ఇప్పుడు ఈ మేనిఫెస్టో – ఆ మేనిఫెస్టోలను పరిశీలించిన తర్వాత.. జగన్ గురించి జనం టాక్ మారిపోయింది. మద్య నిషేధం చేయలేదు. సీపీఎస్ రద్దు చేయలేదు. జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు. మెగా డీఎస్సీ వేయలేదు.
ఇవి పాత మేనిఫెస్టోలో సీఎం జగన్ చేయని హామీలు. వీటిని ఆయన కనీసం ప్రస్తావించలేకపోయారు. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లో చర్చగా మారింది. అంతేకాదు.. కేంద్రంతో పోరాడి సాధించే విషయాలు ఏవీ మేనిఫెస్టోలో పెట్టకపోవడం కూడా గమనార్హం. ఈ విషయం కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే. కనీసం.. ప్రత్యేకహోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటివాటికి ప్రాధాన్యం లేకుండా పోయాయి. ఇక, కడప ఉక్కు పరిస్థితి గందర గోళంగా మారింది.
ఈ పరిణామాలను అంచనా వేసుకున్న జనాలు.. జగన్‌లో పోరాడే శక్తి లేదని నిర్ణయించుకున్నట్టు తెలు స్తోంది. కేవలం అప్పులు చేయడం ద్వారా మాత్రమే పథకాలు అమలు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తు న్నారని జనాలు చెప్పుకొంటున్నారు. కనీసం ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని కానీ.. మెగా డీఎస్సీ వేస్తామన్న హామీని కానీ.. జగన్ ఇవ్వలేక పోయారు. మొత్తంగా చూస్తే.. మేనిఫెస్టోకు ముందు.. తర్వాత.. జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందనేది జనాల టాక్.
This post was last modified on April 29, 2024 9:53 am
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సూపర్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి నుంచి మళ్ళీ ఇంకో సినిమా రాలేదు. గ్యాప్…
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…