ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద చిక్కు ఎదురైంది. ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ.. ప్రధాన మీడియా అయినా.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ఆయా ప్రకటన వ్యవహారం గుదిబండగా మారింది. ఈ ప్రకటనల్లో ప్రభుత్వ లోగోను వినియోగిస్తుండడం వివాదానికి దారి తీసింది.
దీనిపై నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ ఇస్తున్న ప్రకటనలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) పక్షపాతంగా వ్యవహరిస్తోందని.. వైసీపీ నేతలు, పార్టీ ఇస్తున్న ప్రకటనల్లో.. ఎంసీఎంసీ లోగోలు ఉన్నా.. పట్టించుకోవడం లేదని.. ఆరోపించారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. అంతేకాదు.. వైసీపీ ఇస్తున్న ప్రచారాలు.. ప్రభుత్వమే ఇస్తున్నట్టుగా పేర్కొంటున్నట్టు అయిందన్నారు.
దీని ఖర్చు రూ.కోట్లలో ఉంటుందని.. మరి దానిని ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? లేక.. వైసీపీ ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నారా? అనేది తేలాల్సి ఉందన్నారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకుని వైసీపీ నుంచి ఆ ఖర్చును రాబట్టడంతోపాటు.. ఎంసీఎంసీ నిబంధనలు పాటించకపోవడంపై ప్రభుత్వానికి జరిమానా విధించాలని.. సంబంధిత అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో ఈ వ్యవహారం కీలక ఎన్నికలకు ముందు వివాదంగా మారింది. మరి కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
This post was last modified on April 29, 2024 8:05 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…