ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే పరిస్థితి ఉండేది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి యూటర్న్ తీసుకుంది. మూడు రాజధానులు అని ప్రకటిం చారు. దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. నిరాహార దీక్షలు కూడా సాగాయి. 2020-22 మధ్య పెను యుద్ధమే సాగింది. ఇక, ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అంటే.. సీఎం జగన్ కుండబద్దలు కొట్టారు. తాము గెలిచిన తర్వాత.. విశాఖ నుంచే పాలన సాగిస్తామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా తేల్చి చెప్పారు.
ఒక్క ఈ నగరం గురించే కాదు.. కర్నూలును న్యాయరాజధానిగా కూడా చేస్తామని చెప్పారు. అంటే.. మొత్తంగా మూడు రాజధా నులకే వైసీపీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న రాజధానిని కేవలం శాసన రాజధాని వరకే పరిమితం చేయనున్నారు. ఈ పరిణామాలపై జనాలు తేల్చుకోవాల్సి ఉంటుంది. సీఎం జగన్ చెప్పిన దాని ప్రకారం.. వచ్చే ఐదేళ్ల పాటు కూడా.. రాజధాని అమరావతిలో ఎలాంటి మార్పులూ ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంటుందో అదే కొనసాగనుంది. అంతేకాదు.. సీఎం కార్యాలయం కూడా.. విశాఖకు వెళ్లిపోనుంది.
ఈ పరిణామంపై జనాలు స్పందిస్తారా? లేక.. జగన్ చెప్పినట్టే ఆయన వెంట నడుస్తారా? అనేది జూన్ 4న తేలనుంది. ఇదిలా వుంటే.. ఎన్డీయే కూటమి పక్షాలు మాత్రం ముక్తకంఠంతో అమరావతినే రాజధానిని చేస్తామని.. అధికారం చేపట్టిన మరుక్షణం నుంచి కూడా.. అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేష్ , పవన్ కూడా చాలా సీరియస్‌నేగా ఉన్నారు. వీరు చెబుతున్నట్టు ఎన్నికలు పూర్తిగానే పంతం పట్టినట్టు.. రాజధాని నిర్మాణం పూర్తయితే.. వచ్చే మూడేళ్లలోనే పూర్తిస్థాయిలో ఇది కళ్ల ముందు కనిపించనుంది. ఏదైనా.. ఇప్పుడు జనం చేతిలో రాజధాని నిర్మాణం ఉందనేది వాస్తవం.
This post was last modified on April 28, 2024 12:03 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…