Political News

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై ఆదార‌ప‌డిన వారు.. ఈ పింఛ‌ను సొమ్మును పెంచాల‌ని కోరుకుంటు న్నారు. ఈ విష‌యాన్ని ప‌సి గ‌ట్టిన టీడీపీ అదినేత‌ చంద్ర‌బాబు.. ప్ర‌స్తుతం ఉన్న పింఛ‌నును రూ.3000 నుంచి 4000ల‌కు పెంచుతామ‌ని.. అధికారంలోకి రాగానే ఇచ్చి తీరుతామ‌ని చెప్పారు. ఇంటింటికీ పంపిస్తామ‌ని.. ఏప్రిల్ నుంచే అమ‌లు చేస్తామ‌ని కూడా చెప్పారు.

ఈ విష‌యాన్ని కూట‌మి మేనిఫెస్టోలో సూప‌ర్ సిక్స్‌గా ఉంటుంద‌ని కూడా.. చంద్ర‌బాబు తెలిపారు. అయితే .. దీనికి మ‌రింత‌గా వైసీపీ మేనిఫెస్టో లో ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ ఆశించారు. చంద్ర‌బాబు రూ.4 వేలు ప్ర‌క‌టి స్తే.. జ‌గ‌న్ క‌నీసంలో క‌నీసం రూ.5 వేలైనా ప్ర‌క‌టిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీనిపైనే గ్రామీణ ప్రాంతాల్లోనూ చ‌ర్చ సాగింది. అయితే.. జ‌గ‌న్ మాత్రం ఈ పింఛ‌న్ పెంపుపై బాంబు లాంటి వార్త పేల్చారు. ప్ర‌స్తుతం ఇస్తున్న పింఛ‌నును రూ.3000 అలానే కొన‌సాగిస్తామ‌ని చెప్పారు.

అయితే.. రూ.500 పెంచుతామ‌నిచెప్పినా.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం పెంచేది లేదన్నారు. 2028వ సంవ‌త్సరంలో రూ.250, 2029లో(ఎన్నిక‌ల సంవ‌త్స‌రం) రూ.250 పెంచుతామ‌ని చెప్పారు. ఇది మెజారిటీ పింఛ‌ను దారుల ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించింది. మ‌రోవైపు.. చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి కాదు.. రాకుండానే ఏప్రిల్‌ నుంచి అమ‌లు చేస్తామ‌ని.. రూ.4000 చొప్పున సామాజిక పింఛ‌నును అందిస్తా మని చెబుతున్నారు.

ఇక‌, దివ్యాంగుల పింఛ‌న్ల‌ను చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా రూ.6ల‌కు పెంచుతామ‌ని చెబితే.. జ‌గ‌న్ మాత్రం అసలు వీరి ఊసు కూడా ఎత్త‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. ఎ న్నిక‌ల‌ను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ వేసుకున్న గెలుపు అంచ‌నాలను త‌ల‌కింద‌లు చేసినా ఆశ్చర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఈ పింఛ‌న్ల పెంపుపైనే గెలుపు గుర్రం ఎక్కింది. ఇప్పుడు వీటిని ప‌క్క‌న పెట్ట‌డంతో పార్టీకి ఇబ్బంది త‌ప్ప‌ద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక్క నిర్ణయం 5 సినిమాలకు ఇబ్బంది

నిన్న హఠాత్తుగా ప్రకటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్…

28 mins ago

కాంగ్రెస్ లో కల్లోలం రేపిన రాహుల్ సభ !

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో 17 స్థానాలకు గాను 14 స్థానాలు…

58 mins ago

59 నెంబర్ మీద చరణ్ అభిమానుల కోపం

అదేంటి ఒక సంఖ్య మీద హీరో ఫ్యాన్స్ కి కోపం రావడం ఏమిటనుకుంటున్నారా. దానికి సహేతుకమైన కారణమే ఉంది లెండి.…

1 hour ago

జగన్ వన్ సైడ్ లవ్

కేసులు కావొచ్చు ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం…

2 hours ago

అంతుచిక్కని కల్కి ప్రమోషన్ ప్లాన్లు

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే అత్యంత భారీ అంచనాలతో రూపొందుతున్న కల్కి 2898 ఏడి విడుదలకు అట్టే సమయం…

2 hours ago

తిరుప‌తిలో షాక్ త‌గ‌ల‌బోతోందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకో మూడు రోజుల్లో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నిక‌లు మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఎంత…

3 hours ago