Political News

జ‌గ‌న్ అతి విశ్వాసం.. గెలిపిస్తుందా?

విశ్వాసం ఉండడం త‌ప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవ‌రో అన‌డం లేదు. వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభ్య‌ర్థులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన 2024 మేనిఫెస్టో.. న‌వ‌ర‌త్నాలు 2.0 లో జ‌గ‌న్ విశ్వాసం కంటే.. అతి విశ్వాసం ప్ర‌క‌టించారా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే.. సాధార‌ణంగా.. ఎన్నిక‌ల వేళ పోటీ ఉన్న‌ప్పుడు.. ఆయా పార్టీలు అనుస‌రిస్తున్న తీరును గ‌మ‌నించాల్సి ఉంది.

ఇలా చూసుకుంటే.. భారీ ఎత్తున హామీలు గుప్పించిన టీడీపీ కూట‌మి ఉండ‌గా.. అస‌లు నామ మాత్రంగా కూడా.. ప‌థ‌కాల‌కు సొమ్ములు ఇవ్వ‌కుండా.. వ్య‌వ‌హ‌రించిన తీరు.. వైసీపీ వైపు క‌నిపిస్తోంది. అయితే.. ఈ విష‌యంలో జ‌గ‌న్ క్లారిటీ ఇచ్చారు. తాను అమ‌లు చేస్తున్న సంక్షేమానికి రూ.70 వేల కోట్లు అవుతున్నాయ‌ని.. ఇంత‌కు మించి అమ‌లు చేసే ప‌రిస్థితి లేద‌న్నారు. అంటే.. ఇది ఒక‌ర‌కంగా మంచిదే కావొచ్చు. కానీ, మ‌రోవైపు.. ప‌న్నులు పెంచ‌న‌ని కానీ.. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధ‌నాల‌పై ట్యాక్స్ త‌గ్గిస్తాన‌ని కానీ, చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అంటే.. బాదుడు కొన‌సాగుతుంద‌నే సంకేతాలు వ‌చ్చాయి. ఇక‌, షాదీ ముబార‌క్‌, క‌ళ్యాణ‌ల‌క్ష్మీ వంటి ప‌థ‌కాల నిధులు కూడా పెంచ‌లేదు. ఎలా చూసుకున్నా.. ప్ర‌తి ప‌థ‌కంలోనూ పెద్ద‌గా పెంపు లేదు. కానీ, దీని వెనుక జ‌గ‌న్ అతి విశ్వాస‌మే క‌నిపించింది. తాను ఏం చెప్పినా.. అది విశ్వ‌స‌నీయ‌తేన‌ని ఆయ‌న భావిస్తున్నారు. అందుకే.. తాను ఇచ్చిందే.. సొమ్ము.. తాను చెప్పిందే హామీ అన్న‌ట్టుగా వండి వార్చారు. అంటే.. ఒక‌ర‌కంగా. చంద్ర‌బాబు ఇచ్చిన హామీలు.. హ‌ద్దులు మీరాయ‌ని కూడా జ‌గ‌న్ వెల్ల‌డించారు.

మొత్తంగా చూస్తే.. ఇది విశ్వాసంకాదు.. అతివిశ్వాసంగానే ఉంది. ఎందుకంటే.. రైతులు రుణ‌మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సాధ్యం కాద‌న్నారు. టీడీపీ అధినేత ఏటా రూ.20 వేల వ‌రకు సాయం ప్ర‌క‌టించారు. వైసీపీ అదికూడా ఇవ్వ‌డం లేదు. సో..ఇలా.. బాబును తొండిచేసే ప్ర‌య‌త్నంలో త‌న అతి విశ్వాసాన్ని ప్ర‌ద‌ర్శించుకున్నార‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు క‌నుక‌.. బాబువైపు నిల‌బ‌డితే.. వెంట‌నే సంచ‌ల‌న మార్పులు ఖాయం. ఈ చిన్న లాజిక్‌ను జ‌గ‌న్ మిస్స‌య్యారు. మ‌రి జ‌నం ముందు.. ఎలాంటి తీర్పును ఆయ‌న శిర‌సావ‌హించాల్సి ఉంటుందో చూడాలి.

This post was last modified on April 27, 2024 5:06 pm

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

గోనె వారి స‌ర్వే… కూట‌మి వ‌ర్సెస్ జ‌గ‌న్‌.. లెక్క తేల్చేశారు!

గోనె ప్ర‌కాశరావు. త‌ర‌చుగా సీఎం జ‌గ‌న్‌పైనా.. వైసీపీపైనా నిప్పులు చెరిగే మాజీ వైసీపీ నాయ‌కుడు.. ఒక‌ప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి మిత్రుడు.…

2 mins ago

గ్యాంగ్స్ అఫ్ గోదావరి వాయిదా – రిస్కా సేఫా

వచ్చే వారం విడుదల కావాల్సిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి మళ్ళీ వాయిదా పడి మే 17 బదులు మే 31కి…

1 hour ago

జగన్ ఎందుకు పవన్ పెళ్లిళ్లపై మాట్లాడతాడంటే..

పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు.. ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కోపం వస్తుందో…

1 hour ago

జ‌గ‌న్ ఫారిన్ టూర్‌కు అనుమ‌తి ఇవ్వొద్దు: సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ నెల 17 నుంచి విదేశాల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ప్ర‌స్తుతం…

2 hours ago

జ‌గ‌న్ అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌లేదు..వెయిట్ చేయాల‌న్న ఈసీ

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎన్నిక‌ల సంఘం షాక్ ఇచ్చింది. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ స‌హా ఆస‌రా, చేయూత‌,…

3 hours ago

చింతమనేనితో గొడవ గురించి పవన్..

2014లో తెలుగుదేశంకు మద్దతుగా ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు జనసేనాని పవన్ కళ్యాణ్.…

3 hours ago