Political News

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి వాళ్ల గురించి గొప్పగా మాట్లాడ్డం సహజం. తమిళ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు హైదరాబాద్‌కు వచ్చారంటే చాలు తెలుగు సినిమాల గురించి ఒక రేంజిలో మాట్లాడతారు.

అదే సమయంలో తెలుగులో కెరీర్ క్లోజ్ అయ్యాక బాలీవుడ్‌కు వెళ్లి ఇక్కడి సినిమాల గురించి తక్కువ చేసిన మాట్లాడిన హీరోయిన్లనూ చూడొచ్చు.

ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఆమె బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగి హాలీవుడ్‌కు వెళ్లిపోయాక బాలీవుడ్ గురించి నెగెటివ్‌గా మాట్లాడింది. ఇక్కడి రాజకీయాలతో విసిగిపోవడం వల్లే హిందీ సినిమాలు మానేసి హాలీవుడ్‌కు వెళ్లిపోయినట్లు ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఐతే కొన్నేళ్ల పాటు హాలీవుడ్లో సినిమాలు, టీవీ షోలు చేసి ఇప్పుడు తిరిగి బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన ప్రియాంక.. ఇప్పుడు హాలీవుడ్లో తన కష్టాల గురించి మాట్లాడుతోంది. ఇండియాలో ఉన్నపుడు హాలీవుడ్ మ్యాగజైన్లలో తన ఫొటో ఆరుసార్లు కవర్ ఫొటోగా వచ్చిందని.. కానీ నేరుగా హాలీవుడ్లో అడుగు పెట్టాక ఎవ్వరూ తనను పట్టించుకోలేదని ప్రియాంక చెప్పింది. ఎవ్వరూ తనతో ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదని.. ఎన్నోచోట్ల రిజెక్షన్‌కు గురయ్యానని.. అవమానాలు తప్పలేదని ప్రియాంక వెల్లడించింది.

ఇండియా నుంచి హాలీవుడ్‌కు వచ్చినపుడు చాలా భయపడ్డానని.. తనతో మాట్లాడ్డానికి ఎవ్వరూ లేక ఇబ్బంది పడ్డానని.. ఒంటరితనంతో వేదన అనుభవించానని ఆమె చెప్పింది. అయినా సరే.. తనకు తాను ధైర్యాన్నిచ్చుకుంటూ వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుని మౌనంగా పని చేసుకుపోయానని.. దీంతో గుర్తింపు వచ్చిందని ప్రియాంక తెలిపింది.

This post was last modified on April 27, 2024 5:11 pm

Share

Recent Posts

కొండా సురేఖకు కేబినెట్ హోదా?

తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…

1 hour ago

ఇరుముడి న‌టుడు… రోజుకు 40 వేలు

హీరో హీరోయిన్ల‌కు.. పెద్ద టెక్నీషియ‌న్ల‌కు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోష‌కాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసేవాళ్ల‌కు…

2 hours ago

నాలుగు స్థంభాలాటలో విజేత ఎవరంట

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…

3 hours ago

కీర్తి సురేష్ ఇంత హాటైపోయిందేంటబ్బా..

మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…

3 hours ago

ట్రైలర్ లేకుండా సినిమా… వాటి రిజల్ట్ తెలుసా?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…

4 hours ago

గుర్తించాల్సిన ‘ఎపిక్’ నిజాలు ఇవే

యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుందని భావించిన 'ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్' ఇంకా ఫస్ట్ వీకెండ్ కాకుండానే ఎదురీదుతున్న…

4 hours ago