ఇప్పటి వరకు ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై అత్యంత సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన గోద్రా అల్లర్ల విషయాన్ని కూడా షర్మిల ప్రస్తావించారు. అంతేకాదు.. మహిళల మంగళల సూత్రాలు తెంపిన నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ లెక్క చెప్పగలరా? నన్ను చెప్పమంటారా? అని ప్రశ్నించారు. తాజాగా బాపట్ల పార్లమెంటు పరిధిలో పర్యటించిన షర్మిల.. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జేడీ శీలం తరఫున ప్రచారం చేశారు.
ఈసందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మోడీ సెంట్రిక్‌గా విమర్శలు గుప్పించారు. ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని మోడీ మాట్లాడు తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. హిందువుల ఆస్తులను దోచేసి.. ముస్లింలకు పంచుతుం దని.. దీంతో హిందువుల మంగళసూత్రాలు కూడా మిగలవని.. తెంచేస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపైనే షర్మిల కౌంటర్ ఇచ్చారు. మోడీ పదే పదే కాంగ్రెస్‌పై విషం చిమ్ముతున్నట్టు ఆమె ఆరోపించారు.
మోడీ హయాంలో గుజరాత్ మహిళల మంగళసూత్రాలు ఎన్ని తెగిపడ్డాయో.. ఆయనకు గుర్తు లేదా? మమ్మల్ని చెప్పమంటా రా? అని షర్మిల ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని.. వారి ఇళ్లలో మహిళల మంగళ సూత్రాలు తెగలేదా? అని ప్రశ్నించారు. మణిపూర్(ఈశాన్యరాష్ట్రం)లో గత ఏడాది తెరమీదకి వచ్చిన అల్లర్లలో అనేక మంది చనిపోయారని.. వారి భార్యల మంగళసూత్రాలు తెంచలేదా? అని అన్నారు. ఇంకా ఎన్ని మంగళసూత్రాలు తెంచాలని మోడీ భావిస్తున్నారని నిలదీశారు. మతాల మధ్య చిచ్చు పెట్టి.. మంగళసూత్రాలు తెంచే పథకాన్ని ఆయన తెస్తున్నారని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on April 24, 2024 6:22 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…