టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు అసలు పరీక్ష ఎదురైంది. ఇప్పటి వరకు ప్రచారంలో దూసుకుపో తున్న ఆయన.. మరోవైపు టికెట్ల పంపిణీ.. టికెట్ దక్కని అభ్యర్థులను ఓదార్చడం.. టికెట్ దక్కిన వారికి దిశానిర్దేశం చేయడం వంటివాటితో పాటు.. ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా చూస్తున్నారు. మొత్తంగా చంద్రబాబుకు ఈ ఎన్నికలు తలకు మించిన భారంగానే ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. మరోవైపు.. కూటమిలో ఎదురవుతున్న సమస్యలను కూడా ఆయనే పరిష్కరించాలి.
వ్యూహ ప్రతివ్యూహాలు.. నాయకులను గెలిపించుకోవడం.. అధికార పార్టీ వైసీపీని ఎదుర్కొనేలా ప్రచార యుద్ధంలో మాటల తూటాలు పేల్చడం వంటివి ఇంపార్టెంట్‌గా మారాయి. వీటి తాలూకు పరీక్ష మే 13న జరగనుంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు అసలు సిసలు పరీక్ష తెరమీదికి వచ్చింది. దీనికి గడువు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది. దీంతో ఈ పరీక్షలో బాబు ఏమేరకు సక్సెస్ అవుతారనేది చూడాలి. ఇక్కడ తేడా కొడితే.. మొత్తానికే మోసం రానుందనేది హెచ్చరిక.
విషయం ఏమిటంటే.. చాలా మందికి టికెట్లు దక్కక పోవడంతో ప్రస్తుతం వారిలో సగం మంది ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. మరికొందరు.. ఇతరులను ప్రోత్సహించి మరీ నామినేషన్లు వేయిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చితకా పార్టీలు సహా ఇండిపెండెంట్లు కుప్పం నుంచి టెక్కలి వరకు.. వేల సంఖ్యలో నామినేషన్లు వేశారు. వీరు లైన్‌లో అలానే ఉంటే.. చీలేదే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటే. అది 100 ఓట్ల నుంచి 10 వేల వరకు ఉండే అవకాశం ఉంది.
సో.. ఇప్పుడు ఇండిపెండెంట్లు.. టీడీపీకి భారీ తలనొప్పిగా మారారు. దీంతో వీరిని ఏదో ఒక రకంగా బుజ్జిగించి.. నామినేషన్లు ఉపసంహరించుకునేలా చంద్రబాబు చక్రం తిప్పాల్సి ఉంది. దీనికి కేవలం 4 రోజుల గడువు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నెల 28వ తేదీ వరకు.. నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈ లోగా.. స్వతంత్రులు, చిన్న చితకా పార్టీలను కీలకమైన మంగళగిరి, హిందూపురం, టెక్కలి, కుప్పం తదితర నియోజకవర్గాల నుంచి తప్పించాల్సి ఉంది. లేకపోతే.. బాబుకు మరిన్ని సంకటాలు ఎదురు కావడం ఖాయమని అంటున్నారుపరిశీలకులు.
This post was last modified on April 23, 2024 2:37 pm
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్…
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…