టీడీపీలో కీలక ఘట్టానికి పార్టీ అధినేత చంద్రబాబు తెరదీశారు. కూటమిలో భాగంగా మొత్తం 144 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు 144 మంది అభ్యర్థులకు పార్టీ తరఫున బీఫారాలు అందించారు. అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తున్న 17 స్థానాలకు కూడా.. ఆయన ఆయా అభ్యర్థులకు బీఫారాలు అందించారు. ఉండ వల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ బీ ఫారాలను అందజేశారు.
అయితే.. వీరిలో కొందరికి చడీచప్పుడు లేకుండా.. ఈ రోజు ఉదయమే సమాచారం అందించి.. నియోజ కవర్గాల్లో మార్పులు చేయడంతో ఆయా స్థానాల్లో మంటలు రేగాయి. మడకశిర, మాడుగుల, ఉండి, పాడేరులలో అభ్యర్థులను మార్చారు. దీంతో ఆయా స్థానాల్లో ఇప్పటికే టికెట్ ప్రకటించి.. ప్రచారంలో ఉన్న అభ్యర్థులు చంద్రబాబు చిత్రపటాలపై రాళ్లు రువ్వి.. తీవ్ర రచ్చ సాగించారు. బ్యానర్లు, పార్టీ జెండాలను తగుల బెట్టారు.
మడకశిరలో సునీల్ ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు ఎంఎస్ రాజుకు అవకాశం ఇచ్చారు. ఇది ఇక్కడ మంటలు రేపింది. ఇక, ఉండిలో ఇప్పటికే ప్రచారంలో దూకుడుగా ఉన్న మంతెన రామరాజును పక్కన పెట్టి రఘురామరాజుకు అవకాశం ఇచ్చారు. ఇది కూడా.. పార్టీలో మంటలు రేపింది. పార్టీ నాయకులు కార్యాలయానికి తాళాలు వేసి.. జెండాలు పీకేసి వెళ్లిపోయారు. ఇక, పాడేరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ టకెట్‌ను చడీ చప్పుడు లేకుండా.. గిడ్డి ఈశ్వరికి ప్రకటించారు.
ఇక, తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఆత్మహత్య చేసుకుంటానన్న బండారు సత్యనారాయణ మూర్తికి.. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల స్థానం ఇచ్చారు. అయితే.. ఇక్కడ ఆల్రెడీ ఎన్నారై పైలా ప్రసాద్ రూ. కోట్లు ఖర్చు పెట్టుకుని ప్రచార వాహనాలు ఏర్పాటు చేసి.. ప్రచారంలో ఉన్నారు. దీంతో తాజా మార్పు ఆయనలోనూ మంటలు రేపింది. దీనికితోడు.. వెంకటగిరి నియోజకవర్గంలో కోడలిని కాదని.. మళ్లీ మామకే కురుగుండ్ల రామకృష్ణకు చంద్రబాబు చాన్సిచ్చారు. ఇక్కడ మాత్రమే అసంతృప్తి లేదు. మరి మిగిలిన స్థానాల్లోనూ.. పార్టీలో అసంతృప్తి నెలకొంది. ఏదేమైనా చంద్రబాబు అనుకున్నది చేశారు. తమ్ముళ్లు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on April 21, 2024 1:47 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…