కాంగ్రెస్ పార్టీ మారింది. అవును.. దేశంలో ఇతర చోట్ల ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి. ఇది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఇప్పుడు మాటకు మాట సమాధానం ఇస్తూ.. ప్రతిపక్షాలకు బలంగా కౌంటర్ ఇస్తూ.. ప్రజల్లో ఆదరణ పెంచుకుంటూ.. బలోపేతమవుతూ తెలంగాణలో పార్టీ సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ముందుండి నడిపిస్తుండగా.. ఇతర సీనియర్ నాయకులు కూడా అండగా నిలబడుతుండటంతో పార్టీ పరిస్థితి మెరుగుపడుతోందనే చెప్పాలి.
తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంగా ఇక్కడి ప్రజలకు చేరవయేందుకు కాంగ్రెస్కు సమయం పట్టింది. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్‌కు జనాలు జై కొట్టారు. అప్పుడు కాంగ్రెస్‌లో పోరాట పటిమ కొరవడింది.
ప్రజల ఆదరణ తిరిగి సంపాదించడంలో వెనుకబడింది. పార్టీలోని సీనియర్ల మధ్య ఐక్యత లేకపోవడం, అంతర్గత విభేదాలతో మరింతగా బ్యాడ్ అయింది. ఇదే అదనుగా కేసీఆర్ ఆ పార్టీని ఖాళీ చేసేందుకూ చూశారనే టాక్ ఉంది. ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లోకి వలసలు కొనసాగాయి. కానీ కాలం ఒకేలా ఉండదు కదా.
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మారింది. కార్యకర్తల్లో జోష్ నింపి, సీనియర్ నాయకులను ఒక్కతాటిపైకి తెచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా చేయడంలో రేవంత్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌కు రాష్ట్రంలో తిరుగనేది లేకుండా చేయాలని రేవంత్ సాగుతున్నారు. అందుకే బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటున్నారు.
సభల్లో మాటల తూటాలతో కార్యకర్తల రక్తాన్ని మరిగిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా రేవంత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ సమర్థంగా పనిచేస్తున్నాడని కితాబిస్తూనే బీఆర్ఎస్‌పై విమర్శల దాడి చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చుట్టూ హైటెన్షన్ వైర్‌లా తాను ఉన్నానని, ముట్టుకోవాలని చూస్తే మాడిపోతారని బీఆర్ఎస్‌కు రేవంత్ ఇచ్చిన మాస్ వార్నింగ్ వైరల్‌గా మారింది. ఇలా పార్టీ నాయకులకు భరోసానిస్తూ, కార్యకర్తలకు నమ్మకాన్ని కలిగిస్తూ పార్టీని స్ట్రాంగ్‌గా చేస్తూ సాగుతున్నారు.
This post was last modified on April 21, 2024 11:53 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…