బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పురంధీశ్వరికి వున్న బంధుత్వం నేపథ్యంలో బీజేపీలోని వైసీపీ వర్గం, ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.
ఈ బీజేవైసీపీ వర్గం ఎంతకు తెగించిందంటే, రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పురంధీశ్వరిని ఓడించేందుకు వ్యూహ రచన చేసేంతలా.! ఈ బీజేవైసీపీ వర్గానికి, వైసీపీ నుంచి ఫండింగ్ అందుతోందన్న అనుమానాలు లేకపోలేదు.
సోషల్ మీడియా వేదికగా ఈ బీజేవైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీతో, కూటమికి ఏమైనా నష్టం వుంటుందా.? అంటే, కూటమికి మొత్తంగా కలిగే నష్టమేమీ వుండకపోవచ్చుగానీ, కూటమి తరఫున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు మాత్రం నస్టం గణనీయంగానే వుండొచ్చు.
టీడీపీ మీద ఈ బీజేవైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తే అది వేరే లెక్క. కానీ, ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఓడించే కుట్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫక్తు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ బీజేవైసీపీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అలాగే, కూటమి అభ్యర్థులందరిపైనా ఈ బీజేపీ వైసీపీ వర్గం జుగుప్సాకరమైన దాడి చేస్తోంది సోషల్ మీడియా వేదికగా.
తనపై జరుగుతున్న దుష్ప్రచారం అలాగే కూటమిపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికే పురంధేశ్వరి, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on April 22, 2024 2:16 pm
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…
దర్శకుడు, నటుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆయన ఏం మాట్లాడి నా ఆలోచించి.. మాట్లాడతారు.. ఏం…
తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర…
ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రిలీజైన అయిదారు నెలల తర్వాత దాని మీద ఆసక్తి తగ్గిపోవడం సహజం.…
తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డీఎంకే ప్రభుత్వ తీరుపై తన వినూత్న నిరసనతో హాట్ టాపిక్గా మారారు. ఇటీవల…