టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి పోటీ చేస్తున్న ఆయన విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న మాజీ మంత్రి గంటా మరోసారి విజయ గంట మోగించాలని చూస్తున్నారు. ఈ సారి భీమిలీలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నుంచి గంటా శ్రీనివాసరావుకు గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.
1999లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో చేరి 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో తిరిగి టీడీపీలో చేరిన గంటా.. 2014లో భీమిలీలో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సారి మళ్లీ భీమిలీ నుంచి బరిలో దిగారు. మరోసారి భీమిలి ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకంతో గంటా సాగుతున్నారు. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత అవంతిపై వ్యతిరేకత కూడా తనకు కలిసొస్తుందని గంటా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నార్త్ నుంచి భీమిలీకి వచ్చిన టీడీపీ నాయకుణ్ని ప్రజలు నమ్మరంటూ అవంతి ప్రచారం చేస్తున్నారు. కానీ గతంలో భీమిలీలో తాను గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను ఇక్కడి వాడినే అంటూ గంటా రేసులో దూసుకెళ్తున్నారనే చెప్పాలి. కింది స్థాయి నుంచి వైసీపీ నేతలనూ తనవైపు తిప్పుకోవడంలో గంటా సక్సెస్ అవుతున్నారు. బలాన్ని పెంచుకుంటూ మరోసారి విజయం దిశగా సాగుతున్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, అక్కడ జనాల నాడీని బట్టి ఈ సారి భీమిలీలో తెలుగు దేశం జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 27, 2024 2:42 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…