Political News

అక్క‌డ బోణీ కొడితే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు అధికార వైసీపీకి, టీడీపీకి కీల‌కంగా మారాయి. అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డం కోసం జ‌గ‌న్‌.. ఈ సారి కూట‌మిని అధికారంలోకి తేవ‌డం కోసం బాబు తెగ క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ రెండు పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. కానీ ఎన్నిక‌లు మాత్రం హోరాహోరీగా ఉండే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌నే టాక్‌. ఏ స‌ర్వే కూడా ట‌ఫ్ ఫైట్ ఉంటుంద‌ని చెప్ప‌డం లేదు. అన్ని స‌ర్వేలు టీడీపీ కూట‌మిదే విజ‌య‌మ‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. దీంతో చంద్ర‌బాబు మ‌రింత జోష్‌తో సాగుతున్నారు. జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంద‌ని విమ‌ర్శిస్తూ విజ‌యంపై ధీమాతో బాబు ఉన్నారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌గ‌న్‌పై, వైసీపీపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌తను మ‌రింత అనుకూలంగా మార్చేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుత ప‌రిమాణాలు చూస్తుంటే ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన కూట‌మిదే విజ‌య‌మ‌ని అనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల వ‌ర‌కూ మ‌రింత జాగ్ర‌త్త‌తో ఈ కూట‌మి సాగ‌డం ముఖ్యం. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌ను ఓట్ల రూపంలోకి మారిస్తేనే కూట‌మి గెలుస్తుంది. ఈ నేప‌థ్యంలో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పై బాబు స్పెష‌ల్‌గా ఫోక‌స్ పెట్టార‌నే టాక్ వినిపిస్తోంది.ఇప్ప‌టివ‌ర‌కూ టీడీపీకి పెద్ద‌గా అచ్చిరాని ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు బావుటా ఎగిరేస్తే అది పార్టీకి మ‌రింత‌గా క‌లిసొస్తుంద‌ని బాబు న‌మ్ముతున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఏపీలోని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ బోణీ కొట్ట‌లేక‌పోయింది. పూత‌ల‌ప‌ట్టు, రంప‌చోడ‌వ‌రం, రాజాం, శ్రీశైలం, నెల్లూరు రూర‌ల్‌, పులివెందుల త‌దిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచిందే లేదు. ఇక విజ‌య‌వాడ పశ్చిమ‌, కోడుమూరు, య‌ర్ర‌గొండ‌పాలెంలోనూ ప‌రిస్థితి అంతంత‌మాత్ర‌మే. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ సారి విజ‌యం సాధిస్తే అధికారం ద‌క్కించుకోవ‌డం మ‌రింత తేలిక‌వుతుంద‌న్న‌ది బాబు అభిప్రాయ‌మ‌ని టాక్‌. అందుకే ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌పై బాబు స్పెష‌ల్‌గా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఇక్క‌డ వైసీపీని దెబ్బ‌కొట్టే వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. 

This post was last modified on April 20, 2024 3:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

3 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

8 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

11 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

12 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

13 hours ago