రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడో స్టార్ లీడర్. ఎలాంటి ఆశలు లేని పొజిషన్ నుంచి పార్టీని బలోపేతం చేసి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంతో రేవంత్ పేరు మార్మోగుతోంది. తెలంగాణలో ఉనికే ప్రశ్నార్థకమైన తరుణంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్.. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పార్టీ లోపల, బయట ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదుర్కొని, చివరకు పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఈ కారణంతోనే ఇప్పుడాయన జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రేవంత్‌ను ఎంకరేజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పాపులర్ లీడర్‌గా ఎదిగిన రేవంత్.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి పార్టీకి కీలకం కానున్నారు. తెలంగాణలో మెజారిటీ లోక్‌సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా రేవంత్ సాగుతున్నారు. ఇక ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్‌ను కావాలని కోరుకుంటున్నారు. రేవంత్ వచ్చి తమ రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని ఆహ్వానిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రేవంత్ చరిష్మాను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు సిద్ధమైంది. అందుకే తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారంలో రేవంత్‌ను ఉపయోగించుకుంటోంది.
తాజాగా కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రేవంత్ ప్రచారం నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ పోటీ చేస్తున్న వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతుల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. తన స్పీచ్‌లో అక్కడి వాళ్లను ఆకట్టుకున్నారు. వారణాసి, వయనాడ్‌కు మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతోందని, రాహుల్‌ను గెలిపించాలని కోరారు. అంతే కాకుండా బీజేపీ ప్రభుత్వం, మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ వాగ్ధాటి ప్రతిభ కారణంగా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన ప్రచారానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే కర్ణాటకలో పర్యటించనున్న రేవంత్.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం నిర్వహిస్తారని తెలిసింది.
This post was last modified on April 20, 2024 1:48 pm
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…