ఏపీ సీఎం జగన్ షాక్‌కు గురయ్యే వార్త ఇది! ఎందుకంటే.. ఈనాడు అధిపతి మార్గదర్శి ఫైనాన్స్ సంస్థ అధినేత రామోజీరావు అక్రమాలు చేస్తున్నారని.. ప్రజలను మోసం చేస్తున్నారని.. పేర్కొంటూ.. ఆయన సంస్థలపై దాడులు చేయించడం.. కేసులు పెట్టించడం తెలిసిందే. ఇదిప్రస్తుత న్యాయస్థానాల పరిధి లో ఉంది. అంతేకాదు.. ఈ సంస్థలను మూసేయాలని కొడాలి నాని, జోగి రమేష్ వంటి వారు సైతం డిమాండ్ చేశారు. ఇక, సీఐడీ కేసులు.. మేనేజర్ల అరెస్టులు కామన్ అయిపోయాయి.
కట్ చేస్తే.. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం ఇంతగా మోసాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న మార్గదర్శి చిట్స్ సంస్థలో ఇదే ప్రభుత్వానికి చెందిన కీలక మంత్రికి ఖాతా ఉందని తెలుసా? ఇది పక్కా నిజం. ఆ మంత్రి ఎవరో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. జబర్దస్త్ రోజా. ఈమె తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమె సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం పేర్కొన్నారు.
మార్గదర్శిచిట్ ఫండ్స్‌లో తన పేరుతో రూ.40 లక్షల విలువైన చీటీ ఉందని రోజా తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. దీనిని 2020లో వేసినట్టు తెలిపారు. అంటే.. అప్పటికే మార్గదర్శిపై ప్రభుత్వం నుంచి విమ ర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థ మోసం చేసిందని కూడా సర్కారు పేర్కొంది. అయినా.. రోజా ఇక్కడ ఇంత విలువైన చీటీ వేయడం చూస్తే.. జగన్ కు షాక్ కాక మరేం వస్తుంది!!
ప్రస్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఒకవైపు ప్రభుత్వం మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని చెబుతుంటే.. మరోవైపు మంత్రే చీటీలు వేయడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని అంటున్నారు.
This post was last modified on April 20, 2024 10:37 am
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…