ఈటల రాజేందర్.. ఒకప్పుడు వెలుగు వెలిగిన సీనియర్ నాయకుడు. ఉప ఎన్నికలు కూడా కలుపుకొని వరుసగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఆయనకు తిరుగులేదు. ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగానూ పని చేశారు. కానీ ఇప్పుడు ఈటల రాజేందర్ పరిస్థితి వేరు. రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. పొలిటికల్ కెరీర్ కొనసాగించడం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఈటలకు.. ఈ ఎలక్షన్ చావోరేవో లాంటిదే.
బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ స్థాయి వేరు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి కేసీఆర్ ఆగ్రహానికి గురైన ఈటల.. పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. దీంతో పార్టీ మారినా ఈటలకు ఏ ఢోకా లేదనిపించింది. కానీ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్సైంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీగా గజ్వేల్‌లో, మరోవైపు తన నియోజకవర్గం హుజూరాబాద్‌లో ఈటల పోటీ చేశారు. కానీ రెండు చోట్ల ఓడిపోవడంతో షాక్ తగిలింది. రాజకీయ ప్రస్థానమే ప్రమాదంలో పడింది.
ఈ పరిస్థితిల్లో హైకమాండ్‌తో చర్చించి మల్కాజిగిరి ఎంపీగా పోటీలో నిలిచారు. బీజేపీ తరపున ఈటల తాజాగా నామినేషన్ వేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు ఈటలకు అత్యవసరం. ఓ వైపు బీజేపీ పార్టీలోనే ఈటలపై కాస్త వ్యతిరేకత ఉన్నప్పటికీ.. వాటన్నింటినీ దాటి మల్కాజిగిరి రేసులో నిలిచారు. కానీ ఇక్కడ విజయం అంత సులభం కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గత లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ గెలిచారు. సిటింగ్ స్థానాన్ని కోల్పోకూడదనే పట్టుదలతో ఉన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో అద్భుత ఫలితాలు సాధించిన బీఆర్ఎస్.. లోక్‌సభ స్థానాల్లోనూ పాగా వేయాలని చూస్తోంది. ఆ పార్టీ నుంచి నిలబడ్డ రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. ఈ సవాళ్లను దాటి, పోటీని అధిగమించి ఈటల గెలుస్తారా? అన్నది చూడాలి.
This post was last modified on April 20, 2024 1:48 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…