ఎన్నికలకు సమయం చేరువ అవుతున్న కొద్దీ వైసీపీ అధినేత జగన్‌లో అసహనం పెరుగుతోందా? ఆయన ఎక్కడో గాడి తప్పు తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా కాకినాడలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి, జనసేన అధినేత పవన్‌లపై తీవ్ర విమర్శలు గుప్పిం చారు. ఇప్పటి వరకు జగన్ చేసిన విమర్శలకు.. ఇప్పుడు చేసిన విమర్శలకు తీవ్రమైన తేడా ఉండడం.. ఘాటెక్కడంతో ఆయా పార్టీల నుంచి విమర్శలు అదే రేంజ్‌లో వినిపిస్తుండడం గమనార్హం.
చంద్రబాబు: టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ.. పిల్లిని చంకలో పెట్టుకుని తిరుగుతున్నారని జగన్ వ్యా ఖ్యానించారు. పవన్‌ను పిల్లిని చేసి ఆడిస్తున్నారని అన్నారు. అంతేకాదు.. పిఠాపురం పిల్లి
చిన్న జ్వరానికే హైదరాబాద్ పారి పోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జనసేన గుర్తు గాజు గ్లాసును వాడుకునే ది చంద్రబాబు.. దానిని భద్రంగా కడిగి.. తుడిచి పెట్టేది మాత్రం పిఠాపురం పిల్లేనని వ్యాఖ్యానించారు.
పవన్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మాట్లాడుతూ.. నాలుగు నియోజకవర్గాలు-నాలుగు పెళ్లిళ్లు అంటూ.. తీవ్రస్థా యిలో జగన్ విమర్శలు గుప్పించారు. గతంలో పాలకొల్లు, తర్వాత.. భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసి ఓడిపోయాడని.. ఇప్పుడు పిఠాపురం చేరుకున్నాడని అన్నారు. పెళ్లిళ్లు కూడా ఇంతేనని మూడు పోగా.. నాలుగోది కొనసాగుతోందన్నారు. ఇలాంటి వ్యక్తికి ఇక్కడ ఓట్లేస్తారా? అని ప్రజలను ప్రశ్నించడం విశేషం.
పురందేశ్వరి: బీజేపీ చీఫ్ పురందేశ్వరి గురించి తొలిసారి.. సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె చంద్రబాబుకు చెంచాగా అభివర్ణించారు. చంద్రబాబు చేరమంటే.. కాంగ్రెస్‌లో చేరారని.. తర్వాత.. అక్కడ నుంచి బయటకు రమ్మంటే వచ్చారని.. తర్వాత బీజేపీలో చేరారని.. ఇప్పుడు పొత్తులుపెట్టుకోవడం వెనుక కూడా ఆమెను చంద్రబాబు ఒప్పించారని.. వ్యాఖ్యానించారు. ఏకగా తన తండ్రికి కూడా వెన్పుపోటు పొడిచారని.. ఇదంతా చంద్రబాబు చెప్పినట్టే ఆమె చేశారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబుచెప్పిన వారికే టికెట్ ఇచ్చారని విమర్శించారు.
This post was last modified on April 19, 2024 11:17 pm
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…