బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతుంటే ఓ అర్థం ఉండేది. ఆయన మాటలు తూటాల్లాగా పనిచేసేవి. ఆయన స్పీచ్ కార్యకర్తల రక్తాన్ని మరిగించేది.. ఇదీ ఒకప్పుడు కేసీఆర్ మాటతీరుపై ఉన్న అభిప్రాయం. కానీ ఇప్పుడది మారుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సగటు రాజకీయ నాయకుడిలా కేసీఆర్ కూడా నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు రుజువు అని విశ్లేషకులు చెబుతున్నారు. అసలు ఈ వ్యాఖ్యల్లో లాజిక్ ఏమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.
గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు చావుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ చేతిలో అనూహ్య ఓటమికి గురైంది. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్.. నిరుడు తొలిసారి పరాజయం పాలైంది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కేసీఆర్‌కు మరింత తలనొప్పిగా మారాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందనే అంచనాలు కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని టాక్. ఇలాంటి సమయంలో పార్టీపై కార్యకర్తలకు నమ్మకం పోకుండా, పార్టీలో మిగిలిన నాయకులు కూడా జంప్ కాకుండా చూసేందుకు కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సమాచారం. బీఆర్ఎస్‌తో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారంటే అప్పుడు కార్యకర్తలకు కూడా పార్టీపై ఇంకా నమ్మకం ఉంటుంది.
అందుకే ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళ పరిస్థితి తలెత్తనుందని కేసీఆర్ వ్యాఖ్యానించారని చెప్పాలి. అప్పుడు బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని నాయకుల్లో నమ్మకం పెంచేలా మాట్లాడారు. లేకపోతే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వచ్చేస్తామంటే కేసీఆర్ వద్దనడం ఏమైనా నమ్మశక్యంగా ఉందా? అధికారంలో ఉన్న పార్టీలో నుంచి మనుగడనే ప్రమాదంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీలోకి ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఒకట్రెండు సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమయంలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపడానికే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకుల అంచనా.
This post was last modified on April 19, 2024 6:47 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…