టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా 8వ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భవించిన 1983 నుంచి ఇప్పటి వరకు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న ఎన్. రంగస్వామి నాయుడు.. తొలిసారి టీడీపీ జెండాపై పోటీ చేశారు. ఆయన భారీ విజయం దక్కించుకున్నారు. తర్వాత.. జరిగిన 1985 ఎన్నిక ల్లోనూ ఈయనకే అన్నగారు అవకాశం ఇచ్చారు. రెండోసారి కూడా నాయుడు విజయం దక్కించుకున్నారు.
ఇలా మొదలైన టీడీపీ ప్రస్థానం.. ఇక, 1989 ఎన్నికల నుంచి కుప్పంలో అసలు తిరుగే లేదన్నట్టుగా ముందుకు సాగింది. అప్పటి నుంచి 2019 వరకు 7 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ ఏడు సార్లు(1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019) చంద్రబాబు ఘన విజయం సాధించారు. ఇక, ఇప్పుడు ఎనిమిదోసారి కూడా చంద్రబాబు ఇక్కడ నుంచి నామినేషన్ వేస్తున్నారు. అయితే.. గత ఏడు సార్లకు భిన్నంగా ఈ సారి ప్రత్యే క చోటు చేసుకుంది. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు నేరుగా నామినేషన్లు వేస్తున్నారు.
అయితే.. ఈ దఫా మాత్రం ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్ వేశారు. అంతే కాదు.. ఎప్పుడూ లేని విధంగా స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో పత్రాలను ఉంచి భువనేశ్వరి పూజలు చేశారు. అనంతరం అవే పత్రాలను లక్ష్మీపురంలో ఉన్న మసీదులోనూ ఉంచి.. ప్రత్యేక ప్రార్థనల్లోనూ ఆమె పాల్గొన్నారు. అంతేకాదు.. మరికొంత దూరంలోని బాబూనగర్ లో ఉన్న చర్చికి తీసుకువెళ్లి.. ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
ఇలా చేయడం ఈ 7 దఫాల్లో ఇదే తొలి సారి కావడం గమనార్హం. అంతేకాదు..చంద్రబాబు తరఫున గతంలో స్థానిక నాయకులు నామినేషన్‌లు వేయగా.. ఈ సారి భువనేశ్వరి నేరుగా రంగంలోకి దిగారు. మొత్తానికి కుప్పంపై ప్రత్యక శ్రద్ధే పెట్టినట్టు తెలుస్తోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 19, 2024 4:54 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…