వైద్యో నారాయణో హరి అని పెద్దలు చెప్పారు. భారతీయ వైద్యానికి మూలం ఆయుర్వేదం. క్షీర సాగర మధన సమయంలో సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు ధన్వంతరిగా అమృత భాండం ఒక చేతితోనూ, ఆయుర్వేద శాస్త్రం మరొక చేతితోనూ ధరించి తీసుకు వచ్చాడు. కాబట్టి వైద్యుడునారాయణ స్వరూపుడయ్యాడు. వైద్యుడు చిన్నవాడైనా తగిన మర్యాద ఇవ్వాలి. ఆయన సూచనలు పాటించాలి. ప్రతి గ్రామానికి రామాలయం ఎంత ముఖ్యమో వైద్యాలయమూ అంతే ముఖ్యం. వైద్యులు కూడా వైద్యాన్ని వ్యాపార దృష్టి తో కాక, సేవగా భావించి రోగుల ప్రేమాభిమానాలు పొందాలి.
దర్శి మండలం అబ్బాయిపాలెంకు చెందిన వెంకట రమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో దర్శిలోని ఓ ప్రవైటే ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉండడంతో శస్త్రచికిత్స అవసరం పడింది. అయితే ఆసుపత్రికి చెందిన వైద్యులు చాలా దూరంలో ఉన్నారు. దీంతో ఏం చేయాలా ? అని ఆందరూ ఆందోళనలో ఉన్నారు.
దర్శికి 20 కిలోమీటర్ల దూరంలో టీడీపీ అభ్యర్థి, గైనకాలజిస్ట్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి గర్భిణి పరిస్థితిని వివరించారు. దీంతో వెంటనే ప్రచారం పక్కన పెట్టి ఆసుపత్రికి చేరుకున్న లక్ష్మి శస్త్రచికిత్స నిర్వహించి తల్లీ, బిడ్డలను కాపాడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. వెంకటరమణ కుటుంబ సభ్యులు డాక్టర్ కు మనస్ఫూర్థిగా ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on April 19, 2024 11:05 am
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
వైసీపీ అధినేత జగన్ మరో సోదరి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత.. మరోసారి రం గంలోకి దిగారు.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలతోపాటు పలు విషయాలు చర్చకు…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ క్రమంలోనే అభివృద్ధి వికేంద్రీకరణ,…
ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో…
రాజధానిగా అమరావతిని గుర్తించడంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు.. ఈ క్రమంలో తీసుకు న్న రెండు కీలక నిర్ణయాలు.. తాజాగా…