ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ నామినేషన్ల సందడి.. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే.. రాష్ట్రంలోతొలి రోజే నామినేషన్లు వేసేందుకు చాలా మంది నాయకులు రెడీ అయ్యారు. వారం పరంగా గురువారం రావడం.. తిథి పరంగా దశమికావడంతో నాయకులు.. ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు కదిలారు. వీరిలో చాలా మంది పార్టీల కీలక నాయకులే ఉండడం గమనార్హం.
అయితే.. తొలి అసెంబ్లీ నామినేషన్ మాత్రం.. టీడీపీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, అనంతపు రం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మరోసారి అదృష్టం పరిశీలించుకుంటున్న పయ్యావుల కేశవ్‌ది కావడం గమనార్హం. ఈయన తర్వాత.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారం.. మధ్యాహ్నం 1 గంట సమయానికి దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సమాజ్‌వాదీ పార్టీ నేత(దర్శి) ఉండడం విశేషం.
ఇక, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి నామినే షన్ కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి.. చదిపిరాళ్ల భూపేష్ కావడం గమనార్హం. తర్వాత స్థానంలో యుగతులసి పార్టీ(వైటీపీ) కి చెందిన శంభాన శ్రీనివాసరావు ఉన్నారు. ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా విశాఖ పట్నం పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంటుగా.. వడ్డి హరిగణేష్ నామినేషన్ వేశారు. మొత్తంగా చూస్తే.. తొలిరోజు మంచిదని భావించిన నాయకులు చాలా త్వరత్వరగానే పనికానిచ్చేస్తుండడం గమనార్హం.
This post was last modified on April 18, 2024 3:52 pm
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…
భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…