తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఎక్కడ? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆమె జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న రాములమ్మ ప్రచారంలో మాత్రం తళుక్కుమనడం లేదు. పార్టీలు మారినా తనకు కావాల్సిన ప్రాధాన్యత మాత్రం విజయశాంతికి దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని టాక్. విజయశాంతిని ఎవరూ పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీజేపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని అప్పటి టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. 2009లో మెదక్ ఎంపీగా విజయశాంతి గెలిచారు. 2014లో టీఆర్ఎస్‌ను వదిలి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో కాషాయ కండువా కప్పుకున్నారు. 2023లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇలా పార్టీలు మారుతూనే ఉన్న తనకు తగిన గుర్తింపు రావడం లేదన్నది రాములమ్మ ఆవేదన అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదే పార్టీలో ఉన్న విజయశాంతి ప్రచార కమిటీ, ప్లానింట్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, కన్వీనర్‌గా బాధ్యతలూ చేపట్టారు. కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విజయశాంతి సైలెంట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సీటు ఆశించారు. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లోనూ మెదక్ ఎంపీగా బరిలో దిగాలనుకున్నారని తెలిసింది. కానీ ఇప్పుడూ మొండిచేయే ఎదురైంది. ఇక ప్రచారంలోనైనా ఆమె మెరుస్తారేమో అనుకుంటే అదీ జరగడం లేదు. రాహుల్ గాంధీ హాజరైన జనజాతర సభలోనూ రాములమ్మ కనిపించలేదు. అసలు ఆమెను ఆహ్వానించడం మర్చిపోయారని తెలిసింది. ఇక ఎవరైనా అడిగితే ప్రచారానికి వచ్చేందుకు విజయశాంతి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. మరి ఎన్నికలు దగ్గరపడేకొద్దీ మెదక్‌లో ఆమె సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on April 18, 2024 5:14 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…