సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా….సింపతీ పొందేందుకు ఇలా చేయాల్సిన అవసరం జగన్ కు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇది డ్రామా కాదని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ, ఆ రాయో ఏదో వచ్చిందో అక్కడ ఉండాలి కదా… ఆ వస్తువు ఉండాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పడిన రాయి మాయమైపోతుందా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. కోడి..గుడ్డు…కోడి పిల్ల అంటూ పాత రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లని..అదే మాదిరిగా జగన్ పై రాయి కూడా లేటెస్ట్ మ్యాజిక్ అని సెటైర్లు వేశారు. ‘‘జగన్ వచ్చాడు..కరెంట్ ఆఫ్ అయిందట…దానికి నేను బాధ్యుడినట..నీదా నాదా ప్రభుత్వం…నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్..నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్…’’అని మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
చంద్రబాబుకే కాదు సగటు మనిషికి కూడా ఈ డౌట్ వస్తోంది. పడిన రాయి ఏమైంది…కేట్ బాల్ అని కొందరు….పిల్లెట్ గన్ అని కొందరు అంటున్నారు. పోలీసులేమో చేతితో రాయి విసిరారు అని చెబుతున్నారు. ఇలా తలో మాట చెప్పడంతో ఇది డ్రామా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఇక, ఇంత టెక్నాలజీ ఉన్నాకూడా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరగడం సందేహాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on April 17, 2024 7:24 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…