ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేయడంతో కాంగ్రెస్‌పై ఏపీ ప్రజలకు తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఈ విభజన తర్వాత ఏపీలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను పట్టించుకోకపోవడమే అందుకు రుజువు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ అనేదే కనుమరుగయే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్‌కు ఆదరణ పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో దూకుడు ప్రదర్శిస్తూ హస్తం పార్టీని తిరిగి ప్రజలకు చేరువ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఓ వైపు వైసీపీ నాయకులను పార్టీలో చేర్చుకుంటూ సాగుతున్నారు. కానీ ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంటుందనే అంచనాలు లేవు. అయితే తమ గెలుపు ముఖ్యం కాదు ఓట్లను చీల్చి వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోందనే చెప్పాలి.
ఈ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అధికార వైసీపీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య ఉండనుంది. అయితే ఈ కూటమిపై వ్యతిరేకతతో తటస్థ ఓటర్లు కొంతమంది వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఆ ఓట్లను కాంగ్రెస్ సాధించగలిగితే అప్పుడు వైసీపీకి గట్టి దెబ్బ తగులుతుంది. షర్మిల కూడా ఇదే వ్యూహంతో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలీజా, చిట్టిబాబు, ఎంఎస్ బాబు కాంగ్రెస్లో చేరి పోటీకి సిద్ధమయ్యారు. మరికొన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్కు మెరుగైన అభ్యర్థులే ఉన్నారు.
ఇలా ఓ 40 స్థానాల్లో బలమైన అభ్యర్తులను పార్టీ నిలబెట్టింది. అయితే వీళ్ల బలం గెలవడానికి సరిపోకపోయినా ఓట్లు చీల్చడానికి మాత్రం పనికొస్తుందనే చెప్పాలి. ఈ నియోజకవర్గాల్లో 15 వేల ఓట్లు వరకూ సంపాదించినా అది వైసీపీ అభ్యర్థులకు ప్రతికూలంగా మారే అవకాశముంది. అంతటి ప్రభావం చూపే వాళ్లనే కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓ నాలుగైదు శాతం ఓట్లు చీల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చాకే అది ఏ పార్టీకి నష్టంగా మారిందన్నది తేలుతుంది.
This post was last modified on April 15, 2024 10:48 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…