రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయిన టాపిక్ విషయంలో ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ ఒకే స్టాండ్ మీద నిలబడడం.. ఒకే విధంగా స్వరం వినిపించడం అవసరం. అలా కాకుండా ముఖ్య నేతల్లో ఒకరు ఒకలా, ఇంకొకరు మరోలా స్పందిస్తే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్పందిస్తున్న తీరు కొంచెం చిత్రంగానే ఉంది. జగన్ మీద రాయి దాడి నిజంగా జరిగిందా.. దీని వెనుక కోడి కత్తి తరహా డ్రామా ఉందా.. అనే విషయంలో రకరకాల సందేహాలు రేకెత్తుతున్న మాట వాస్తవం.
ఐతే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుని దాని ప్రకారమే వ్యవహరించాల్సింది. ఐతే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాజకీయాల ప్రస్తావన లేకుండా హుందాగా ఒక ట్వీట్ పెట్టారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని ఈసీని కోరారు. జగన్‌పై దాడి వెనుక ఏం జరిగి ఉన్నా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు స్పందించాల్సిన తీరు ఇదే.
కానీ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం వేరే రూట్ తీసుకున్నారు. జగన్‌పై దాడి అంతా ఒక నాటకం అంటూ ఆయన ట్వీట్లు వేస్తున్నారు. ఐతే జగన్‌పై దాడిని అనుమానిస్తే అనుమానించవచ్చు. కానీ అది నారా లోకేష్ స్థాయి నాయకుడు చేయాల్సిన పని లేదు. ముందుగా ఆయన ఈ దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ వేయాలి.
ఈ దాడి వెనుక డ్రామా ఉందేమో అని అనుమానించే పని వేరే వాళ్లకు అప్పగించాల్సింది. ద్వితీయ స్థాయి నాయకత్వం ఈ పని చూసుకుని ఉండొచ్చు. నిజానికి టీడీపీలో చాలామంది ఈ పనిలోనే ఉన్నారు. కానీ ఓవైపు చంద్రబాబు హుందాగా ట్వీట్ వేసి జగన్‌పై దాడిని ఖండిస్తుంటే.. ఇంకోవైపు లోకేష్ ఇలాంటి ట్వీట్లు వేయడం ఆయన స్థాయికి తగని పనిలా కనిపిస్తోంది. ఒకే విషయం మీద తండ్రీ కొడుకులు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం చూసేవారికి బాగా అనిపించడం లేదు.
This post was last modified on April 14, 2024 6:05 pm
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…