Political News

ఆ ప‌ది రోజుల‌ు కూట‌మికి మోస్ట్ ఇంపార్టెంట్‌!

కూట‌మి పార్టీల ప్ర‌చారం విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జన‌సేన‌-టీడీపీ-బీజేపీ సంయుక్తంగా ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నారు. ఉభ‌య గోదావ‌రిజిల్లాల్లో చేప‌ట్టిన ప్ర‌జాగ‌ళం.. ఉమ్మ‌డి స‌భ‌ల‌కు భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో ఈ ఊపును రాష్ట్ర వ్యాప్తంగా తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసంలో భేటీ అయిన‌.. మూడు పార్టీల నాయ‌కులు.. ప్ర‌ధానంగా ప్ర‌చారంపైనే దృష్టి పెట్టారు.

ఈ నెల మిగిలిన 15 రోజులు ఎవ‌రికివారుగా ప్ర‌చారం చేయ‌నున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించే అవ‌కా శం లేక‌పోయినా.. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా ప్ర‌చారం చేసుకునేలా ప్లాన్ సిద్ధం చేసుకోవాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. మే 1న పింఛ‌న్ల పంపిణీపై స‌ర్కారుపై ఒత్తిడి తీసుకువ‌చ్చి.. ఈ ద‌ఫా ఎలాంటి ఇబ్బందులూ రాకుండా.. ల‌బ్ధి దారుల‌కు ఇళ్ల వ‌ద్దే పింఛ‌న్ల‌ను పంపిణీ చేయించాల‌ని.. దీనిపై ముందుగానే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ‌లు రాయాల‌ని కూడా తీర్మానం చేశారు.

ఇక‌, మే 2వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు మాత్రం.. మూడు పార్టీలు ఉమ్మ‌డిగానే స‌భ‌లు, స‌మావేశాలు.. రోడ్‌షోలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఈ విష‌యంలో ఎలాంటి మార్పూ ఉండ‌బోద‌ని కూడా పేర్కొన్నారు. కేంద్రం నుంచి వ‌చ్చే ప్ర‌ధాన మంత్రి మోడీ, అమిత్ షా వంటివారి స‌భ‌లకు కూడా మూడు పార్టీల నాయ‌కులు హాజ‌రు కావాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా.. రాష్ట్రంలో బూమ్ తీసుకురావ‌డం ద్వారా.. ఎన్నిక‌ల వ్యూహాన్ని బ‌లోపేతం చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని మూడు పార్టీలు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

ఆ ప‌ది రోజుల పాటు ఉమ్మ‌డిప్ర‌చారం అత్యంత కీల‌క‌మ‌ని.. ఎన్నిక‌ల స్ట్రాట‌జీని మార్చేది.. ఆ ప‌ది రోజులే న‌ని నాయ‌కులు ప్ర‌త్యేకంగా భావిస్తున్నారు. దీంతో చివ‌రి ప‌దిరోజులు అంద‌రూ అందుబాటులో ఉండ‌డంతోపాటు.. క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో ఎండ‌ల తీవ్ర‌త కూడా ఎక్కువగా ఉన్న నేప‌థ్యంలోఉద‌యం పూట‌.. ఆన్‌లైన్ ప్ర‌చారం.. సాయం త్రం 3 గంట‌ల నుంచిఉమ్మ‌డి ప్రచారం చేసుకునేలా ప్లాన్ చేశారు. మొత్తంగా వ‌చ్చే మే 2 నుంచి 11 వ‌ర‌కు ఉమ్మ‌డి స‌భ‌ల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌కు చేర్చాల‌ని నిర్ణ‌యించారు. కాగా, మే 13న రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

This post was last modified on April 15, 2024 8:42 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

40 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago