టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వినియోగిస్తున్న ఐఫోన్ ట్యాపింగ్‌కు గురైందంటూ.. వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఐఫోన్ కంపెనీ యాపిల్… ఈ మేరకు ఆయన ఫోన్‌కు సందేశాలు పంపించి నట్టు టీడీపీ నాయకులు చెబుతున్నారు. అదేసమయంలో హ్యాకింగ్‌కు కూడా గురయ్యే ప్రమాదం ఉందని నారా లోకేష్ కు ఫోన్ సందేశాలు అదేవిధం మెయిల్‌కు కూడా సందేశాలు అందాయని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనివెనుక వైసీపీ నేతల హస్తం ఉందని.. పార్టీ నేతలు ఆరోపించారు.
మరి దీనిలో నిజం ఎంత? అనేది పక్కన పెడితే.. ఐఫోన్ కంపెనీ యాపిల్ రెండురోజుల కిందటే ప్రపంచ వ్యాప్తంగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. తమ కంపెనీ ఫోన్లలో `స్పైవేర్` జొరబడే అవకాశం ఉందని.. కాబట్టి ఫోన్లను జాగ్రత్తగా ఆపరేట్ చేయాలని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రస్తుతం అమెరికా, భారత్ సభా పలు దేశాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఐఫోన్లు వినియోగిస్తున్న సెలబ్రిటీలు, రాజకీయ నేతలను టార్గెట్ చేసుకుని.. స్పైవేర్ సృష్టికర్తలను ఫోన్లను హ్యాక్, ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో అన్ని దేశాలను యాపిల్ కంపెనీ అలెర్ట్ చేసింది. మన దేశం విషయానికి వస్తే.. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే నేతలు ఇప్పటిక కేంద్ర ఎన్నికల సంఘానికి తమ యాపిల్ ఐఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెలిపారు. ఇక, కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఒకరిద్దరి ఫోన్లు(స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్) ట్యాప్ అవుతున్నాయని ఇదే తరహా ఫిర్యాదులు ఐటీ శాఖకు తెలిపారు. కర్ణాటకలో డీకే శివకుమార్ ఫోన్ రెండు నెలలుగా ట్యాప్ అవుతోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అంటే.. మొత్తానికి ఈ సమస్య దేశవ్యాప్తంగా ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలే చేశారా? చేయించారా? అనేది రాజకీయ వివాదమేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on April 12, 2024 9:51 pm
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…