మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం ప్రకటించడం టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్‌గా మారింది.! ఇందులో నిజానికి వింతేమీ లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే, స్వయానా మెగాస్టార్ చిరంజీవికి సోదరుడే కదా.! తమ్ముడి పార్టీకి అన్నయ్య ఆర్థిక సాయం చేయడం అంత ప్రత్యేకమైన విషయమేమీ కాదు.
కాకపోతే, టైమింగ్.! సరిగ్గా ఎన్నికల సమయంలో మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీకి విరాళం ప్రకటించడమే సంచలనం. కేవలం సంచలనం మాత్రమే కాదు, వ్యూహాత్మకం కూడా.! దీన్నొక స్టేట్మెంట్‌గా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘నా తమ్ముడి వెంట నేనున్నాను..’ అనే స్టేట్మెంట్ చిరంజీవి ఇచ్చారన్నది అంతటా వినిపిస్తున్న వాదన.
అయితే, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నిస్వార్దంగా చేస్తున్న ప్రజా సేవ, మరీ ముఖ్యంగా కౌలు రైతుల కుటుంబాలకు అందిస్తున్న సాయం గురించి ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తూ, ఆ సాయానికి తాను అందిస్తున్న సాయం.. అని చిరంజీవి పేర్కొనడం ఆసక్తికరమైన విషయం.
ఇదిలా వుంటే, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారంటూ ఓ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాష్ట్రంలో జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాలన్నిటిలోనూ కాదుగానీ, ఒకట్రెండు నియోజకవర్గాల్లో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేసే అవకాశం వుందట.
కాదు కాదు, కేవలం పిఠాపురం నియోజకవర్గానికే చిరంజీవి ప్రచారం పరిమితమవుతుందనీ అంటున్నారు. అయితే, చిరంజీవి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. రాజకీయాల నుంచి వైదొలగినట్లు గతంలోనే ప్రకటించారు. కానీ, తమ్ముడి కోసం.. పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేసేందుకు చిరంజీవి ఏ క్షణాన అయినా కీలక నిర్ణయం తీసుకోవచ్చు.
This post was last modified on April 12, 2024 6:37 am
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…
రాష్ట్రంలోని ఒక్కొక్క నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కొక్క విధంగా కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం లో ఉన్న పార్టీల వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ..…
స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం…
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తండ్రుల స్థానాల నుంచి పోటీ చేయాలనుకునే వారసులు పెరుగుతున్నారు. రాజకీయాల్లో వారసత్వం కొత్త విషయం…
మొన్న శుక్రవారం విడుదలైన దురంధర్ కొద్దిరోజుల క్రితం వరకు బజ్ పరంగా వెనుకబడే ఉంది. ట్రైలర్ అంత ఎగ్జైటింగ్ గా…