తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు.
ఇలానే.. తాజాగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త.. చిర్రావూరి పంచాంగాన్ని పఠించి వినిపించారు. దీనిలో ఆయన చంద్రబాబు కూటమి పార్టీ.. ఏపీలో 128 అసెంబ్లీ స్తానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో అధికారం చేపట్టేది టీడీపీదేనని చిర్రావూరి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతకం మారిందని చెప్పారు.
గత ఐదేళ్ల కిందట ఏర్పడిన గ్రహ స్థితులు ఇప్పుడు మారాయని. రాజ్యపూజ్యంతోపాటు.. అదికార శక్తి కూ డా వచ్చిందనిచెప్పారు. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి అయిన.. చంద్రబాబుకు రాజయోగం పడుతోందని చిర్రావూరి ప్రకటించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రజల మ న్ననలు కూడా లభిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. మొత్తగా ఈ ఏడాది టీడీపీకి అదృష్ట యోగం పట్టనుందని వివరించారు.
This post was last modified on April 9, 2024 3:55 pm
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…
పలుమార్లు కరెంట్ బిల్లు చూసి సామాన్యుడికి షాక్ కొట్టడం కామనే. కానీ త్వరలో ఈ టెన్షన్ తగ్గబోతోంది. మన కరెంట్…
అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడ్డాక కొత్త డేట్ కోసం అభిమానుల నుంచి ఒత్తిడి ఎక్కువవుతోంది. అధిక శాతం…
దేశంలో నంబర్ వన్ అని చెప్పుకునే ఇండిగో ఎయిర్లైన్స్, వేలాది మంది ప్రయాణికులను నడిరోడ్డున పడేసింది. ఈ గందరగోళానికి కారణం…
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…