Political News

టార్గెట్ కిష‌న్‌రెడ్డి.. రేవంత్ మాస్ట‌ర్ ప్లాన్‌

తెలంగాణ ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నిక‌ల్లోనూ పార్టీకి ఇక్క‌డ మెరుగైన ఫ‌లితాలు అందించ‌డం కోసం శ్ర‌మిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి నాయ‌కుల‌ను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బ‌కొడుతున్నారు. మ‌రోవైపు రాహుల్ గాంధీ స‌భ‌తో కార్య‌క‌ర్త‌ల్లో జోష్ నింపారు. ఇక లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ ఫోక‌స్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్ర‌స్తుతం పెద్ద త‌ల‌కాయ‌ను రేవంత్ టార్గెట్ చేసుకున్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడిగా ఉన్న కిష‌న్ రెడ్డి.. మ‌రోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందాల‌నే ల‌క్ష్యంతో సాగుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని చేజార్చుకోవ‌ద్ద‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ముందుగా కిష‌న్ రెడ్డిపై ఫోక‌స్ పెట్టి.. ఆయ‌న్ని ఎన్నిక‌ల్లో ఓడిస్తే బీజేపీని సైక‌లాజిక‌ల్‌గా దెబ్బ కొట్టొచ్చ‌నేది రేవంత్ ప్లాన్‌గా తెలుస్తోంది. అందుకే సికింద్రాబాద్‌లో కిష‌న్ రెడ్డి ఓట‌మి కోసం రేవంత్ స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్‌తో ప‌ని చేస్తున్నార‌ని టాక్‌. ఇప్పటికే అక్క‌డి ప‌రిస్థితుల‌పై అంచ‌నాకు వ‌చ్చిన రేవంత్‌.. అక్క‌డ అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించిన‌ట్లు తెలిసింది.

సిటింగ్ ఎంపీగా ఉన్న కిష‌న్ రెడ్డి.. సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చేసిందేమీ లేద‌నే విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని నాయ‌కుల‌కు రేవంత్ సూచించారు. తాజాగా సికింద్రాబాద్, వ‌రంగ‌ల్‌ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాంగ్రెస్ నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేల‌తో రేవంత్ స‌మీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కిష‌న్‌రెడ్డిపై ఉన్న వ్య‌తిరేక‌త‌ను సానుకూల‌త‌గా మార్చుకోవాల‌ని రేవంత్ సూచించిన‌ట్లు స‌మాచారం. ఇక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థి దానం నాగేంద‌ర్‌ను ఎలాగైనా గెలిపించుకోవాల‌ని రేవంత్ కంక‌ణం క‌ట్టుకున్నారు. కిష‌న్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మ‌రింత జోష్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్న రేవంత్‌.. ఆ దిశ‌గా సాగుతున్నారు.

This post was last modified on April 8, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

2 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

8 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

11 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

12 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

12 hours ago