Political News

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబి విచారణ ప్రారంభం

రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో జరిగిందని ప్రభుత్వం భావిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఏసిబి కూడా విచారణ మొదలుపెట్టడం మొదలైపోయింది. అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఈ అంశంపై వైసిపి చంద్రబాబు+మద్దతుదారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.

తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామని జగన్ చెప్పినట్లుగానే ఇపుడు ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ముందు ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించారు. తర్వాత ఏసిబి విచారణకు కూడా ఆదేశించారు. ఏసిబితో పాటు ఈడి కూడా చాలా రోజులు విచారణ చేసింది. ఇంతలో ఇదే విషయంపై సిట్ తో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 4077 ఎకరాలు చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సొంతం చేసుకున్నారంటూ ఆర్ధిక మంత్రి బుగ్గర రాజేంద్రనాధరెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

సరే ప్రస్తుతానికి వస్తే ఒకవైపు సిట్ విచారణతో పాటు సిబిఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సిబిఐ విచారణకు కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినా ప్రభుత్వం సిట్ విచారణకు రెడీ అయ్యింది. అయితే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై విచారణ జరిపేందుకు లేదంటు టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది. కాబట్టి కోర్టులో తేలేంతవరకు సిట్ విచారణ ముందుకు సాగదన్నది వాస్తవం. అలాగే కేంద్రం అంగీకరించేంత వరకు సిబిఐ విచారణ కూడా సస్పెన్సే.

ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం హఠాత్తుగా ఏసిబితో విచారణ జరిపించేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే పలువురిని ఆదుపులోకి తీసుకున్న ఏసిబి ఇకనుండి విచారణలో జోరు పెంచబోతోంది. చాలామందికి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులిచ్చినట్లు సమాచారం. మరి ఏసిబి విచారణ విషయం ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on September 15, 2020 12:28 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఉద్యోగాలపై ఇదేం లాజిక్ జగన్ సార్?

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…

3 hours ago

కమల్ సినిమాకు కమల్ సినిమా సంకటం

లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…

3 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బ్యాలెట్ నెంబ‌ర్ ఖ‌రారు.. ఈజీగా ఓటేయొచ్చు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి  జిల్లాలోని పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ…

4 hours ago

మొదటిసారి ద్విపాత్రల్లో అల్లు అర్జున్ ?

పుష్ప 2 ది రూల్ విడుదల ఇంకో నాలుగు నెలల్లోనే ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా…

4 hours ago

పార్లమెంట్ బరి నుండి ప్రియాంక ఔట్ !

రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో…

4 hours ago

కాంతార 2 కోసం కుందాపుర ప్రపంచం

క్రేజ్ పరంగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్ పుష్ప, సలార్ లతో పోటీపడే స్థాయిలో బజ్ తెచ్చుకున్న కాంతార 2 షూటింగ్…

4 hours ago