‘మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం ఖాయం..’ అని తాజాగా వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు లీక్ అయ్యేసరికి, మంగళగిరి వైసీపీలో లుకలుకలు షురూ అయ్యాయి. ఓడిపోయే సీటుని అంటగట్టారంటూ వైసీపీ అభ్యర్థి, పార్టీ అధినాయకత్వంపై గుస్సా అవుతున్నారట.
నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలోకి దిగాల్సి వుంది. అయితే, ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వుండటంతో ఆయన్ని మార్చింది వైసీపీ. టీడీపీ నుంచి కొందరు నాయకుల్ని లాక్కొచ్చి, వారికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.
అధికారికంగా ముగ్గురు అభ్యర్థులు మారారక్కడ. అనధికారికంగా అయితే, అరడజనుకి పైగానే ప్రయోగాలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థి.. కాబట్టి, ఆమె గెలుస్తుందనీ, నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమనీ వైసీపీ తొలుత భావించింది. మురుగుడు లావణ్య తరఫున తొలుత ప్రచారం అగ్రెసివ్‌గానే సాగింది.
ఇంకోపక్క, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైసీపీ వేవ్ కారణంగా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయినాగానీ, అదే నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వచ్చారు గత ఐదేళ్ళుగా. నారా లోకేష్ వేరే నియోజకవర్గానికి పారిపోతున్నారంటూ వైసీపీ చేసిన ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయి.
ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాకముందే, నారా లోకేష్ మంగళగిరిలో ఎగ్రెసివ్ క్యాంపెయిన్ షురూ చేశారు. అది అలా అలా కొనసాగుతూనే వుంది. స్థానికంగా టీడీపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు.. వాట్ నాట్.. చాలా యాక్టివ్‌గా టీడీపీ, మంగళగిరిలో వర్క్ చేస్తోంది.
అయితే, వైసీపీ నుంచి మంగళగిరిలో ముఖ్య నాయకుల సందడి కనిపించడంలేదు. మురుగుడు లావణ్య ఒంటరి పోరాటం వల్ల వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందాయె. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే క్రమంలో, నియోజకవర్గానికి వైసీపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరి, వైసీపీ పాలన గురించి గొప్పగా చెబుతోంటే, నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎలా చూసినా, మంగళగిరిలో నారా లోకేష్ బంపర్ విక్టరీ ఖాయంగానే కనిపిస్తోంది. ‘మెజార్టీ గురించే ఆలోచిస్తున్నాం.. గట్టిగా కొట్టబోతున్నాం..’ అని తెలుగు తమ్ముళ్ళు మంగళగిరిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on April 6, 2024 6:09 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…