Political News

‘పేద’ బుట్టా రేణుక ఆస్తులు వేలం!

కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. వైసీపీకి భారీ షాక్ త‌గిలింది. నిన్న మొన్ననే.. సీఎం జ‌గ‌న్‌.. ఎమ్మిగ‌నూరు నుంచి పోటీ చేస్తున్న పార్టీ కీల‌క నాయ‌కురాలు.. బీసీ మ‌హిళ బుట్టా రేణుక‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బుట్ట‌మ్మ ఆస్తులు కూడా అంతంత మాత్ర‌మే అన్నారు. అయితే.. ఆ అంతంత మాత్రం ఆస్తులు ఎంతెంత ఉన్నాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. మెరిడియ‌న్ స్కూల్ పేరుతో హైద‌రాబాద్‌లో విద్యావ్యాపారం స‌హా.. క‌ల్యాణ మండ‌పాలు కూడా క‌ట్టించారు.

ఇవి కాక‌..గుర్రాల‌రేసుల్లోనూ పెట్టుబ‌డులు పెట్టారు. స‌రే.. ఇవ‌న్నీ ఎలా ఉన్నా..ఇప్పుడు బుట్టా రేణుక‌కు భారీ షాక్ ఇస్తూ.. ఆమె ఆస్తుల‌ను వేలం వేసేందుకు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్ సంస్థ రెడీ అయింది. దీంతో ఒక్క‌సారిగా ఎమ్మిగ‌నూరులోనే కాకుండా.. వైసీపీలోనూ క‌ల‌క‌లం రేగింది. బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న ఈ-వేలం వేయనున్నట్లు హైదరాబాద్‌లోని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్ ప్ర‌క‌టించింది.

వ్యాపార అవసరాల నిమిత్తం ఈమె కొన్నేళ్ల కిందట ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నుంచి రూ.340 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కొవిడ్‌ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినగా, కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్టా ఇన్‌ఫ్రాతోపాటు ఇతర సంస్థలపై పడింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ నిర్ణయించింది.

బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ)లో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం గమనార్హం. విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నా.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో అంటే.. ఎగ‌వేస్తార‌న్న వాద‌న బ‌లంగా వినిపించిన‌ప్పుడు.. వేలం వేసే అధికారం ఆర్బీఐ ఆర్థిక సంస్థ‌ల‌కు క‌ల్పించింది.

This post was last modified on April 6, 2024 7:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

4 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

9 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

12 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

13 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

14 hours ago