వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా.. ఇతర పనులకు కేంద్ర ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో అసలు సిసలు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్యక్తులు మరింత పరాకాష్ఠకు చేరుకున్నారు. పింఛన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడుతున్నా డని, టీడీపీ అరాచకంగా వ్యవహరిస్తోందని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మరింత ప్రచారాన్ని అరాచక స్థాయికి చేర్చారు.
నడవలేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్నవారిని మంచాలపైనే మోసుకు వచ్చి.. పింఛన్ కేంద్రాల్లో పింఛన్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే సయమంలో నల్ల జెండాలు పట్టుకుని టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వలంటీ ర్లను చంద్రబాబు దూరం పెట్టించారని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు పడుతున్నామనే ధోరణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఈసీ అయినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా.. పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్గ దర్శకాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని అన్నారు. అయితే.. దీనిని కొందరికే పరిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, నడవలేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడు తున్న వారికి ఇంటికే పంపిణీ చేయాలని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విషయాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అరాచక స్థాయికి తీసుకువెళ్లారు.
మరి ఇది ఎంత వరకు సమంజసం..? అనేది ప్రశ్న. ఓడిపోతారని భావించిన వారే ఇలా .. అరాచకాల ప్రచారానికి తెరదీస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుటకలు మింగడం.. సరికాదని హితవు పలుకుతున్నారు.
This post was last modified on April 3, 2024 3:37 pm
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…
టెస్ట్ సిరీస్ ఓటమి బాధను మరిపిస్తూ వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు టీ20లోనూ అదే జోరు కొనసాగించింది. కటక్లోని…
టెక్ ప్రపంచంలోనే ఒక సంచలన ప్రకటన వెలువడింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా ఇవాళ సినీ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేసారు. అందులో పాల్గొన్న నిర్మాత అల్లు…
అఖండ 2 విడుదల డిసెంబర్ 12 ఉంటుందా లేదానే అయోమయం ఇంకా కొనసాగుతోంది. ఆ డేట్ కి రావడం పక్కానే…
ఒకే ఏడాది రెండు రిలీజులతో అభిమానులను ఖుషి చేసిన పవన్ కళ్యాణ్ అతి తక్కువ గ్యాప్ లో మూడో సినిమాతో…