ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వైసీపీ నుంచి మహిళలు పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక, టీడీపీ కూటమి నుంచి కూడా.. పలువురు మహిళలు మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఒకే నియోజకవర్గం లో అటు వైసీపీ నుంచి, ఇటు కూటమి నుంచి కేవలం ఇద్దరూ మహిళలే పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఇతర నియోజకవర్గాల్లో పురుష అభ్యర్థులపై మహిళలు, మహిళా అభ్యర్థులపై పురుషులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి.
పత్తికొండ(కంగాటి శ్రీదేవి-కేఈ శ్యాంబాబు), పాతపట్నం(రెడ్డి శాంతి-గోవిందు), నగరి(రోజా-గాలి భాను ప్రకాష్), మంగళగిరి(లావణ్య-నారా లోకేష్), పిఠాపురం(వంగా గీత-పవన్ కల్యాణ్) వంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే.. గుంటూరు వెస్ట్ నుంచి మాత్రం.. వైసీపీ నుంచి మంత్రి విడదల రజనీ, టీపీపీ కూటమి నుంచి పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోకవర్గం హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ కూడా.. ఒకే సామాజికవర్గానికి(రజకులు) చెందిన వారు. భర్తలు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు.
పైగా గుంటూరు వెస్ట్ జనరల్ నియోజకవర్గం. అయితే.. వ్యూహాత్మకంగా ఈ టికెట్‌ను వైసీపీ బీసీ నాయకురా లు, మంత్రి రజనీకి కేటాయించింది. ఇక, టీడీపీ కూడా.. స్థానిక నేత అయిన మాధవికి ఇచ్చింది. వీరిద్దరూ ఇప్పడు ఇక్కడ హోరా హోరీ ప్రచారం చేసుకుంటున్నారు. రజనీ వాస్తవానికి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓడిపోతారనే ఉద్దేశంతో వైసీపీ ఆమెను గుంటూరు వెస్ట్‌కు కేటాయించింది. ఇక, మాధవి తొలి సారి రాజకీయల్లోకి వచ్చిన వైద్య వ్యాపారంలో ఉన్న వ్యక్తి.
ఇద్దరూ ఉన్నత విద్యావంతులే కావడం, ఆర్థికంగా బలంగా ఉన్న వారే కావడం గమనార్హం. ఇదేసమయం లో ఇద్దరికీ వారి వారి పార్టీల నుంచి అసంతృప్తి ఎక్కువగానే ఉంది. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన వారికి టీడీపీ, వైసీపీలు మొండి చేయి చూపాయి. దీంతో స్థానిక నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ ప్రకటించి.. వారాలు గడిచిపోయినా.. వీరితో మమేకం అయ్యేందుకు, ప్రచారంలో కలిసి వచ్చేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. అయినా.. ఈ ఇద్దరు మహిళా నేతలు ప్రచారం లో దూసుకుపోతున్నారు. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on April 1, 2024 6:55 am
నిన్న విడుదలైన గేమ్ ఛేంజర్ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ అనిపించుకోనప్పటికీ మిక్స్డ్ టాక్ తోనూ క్రమంగా పుంజుకుంటుందనే నమ్మకంలో…
రాయలసీమ అంటేనే… ఫ్యాక్షన్ గొడవలకు పెట్టింది పేరు. నిత్యం వైరి వర్గాలపై దాడులు చేసుకుంటూ కాలం వెళ్లదీసే ఇక్కడి వారిలో…
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా చిత్రం డాకు మహారాజ్ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్లతో మంచి జోరు…
విజయనగరం జిల్లా భోగాపురం వద్ద నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాజెక్టు మరో కీలక మలుపు తీసుకుంది. గోపాలపురం ఎయిర్పోర్టు…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40…
2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత…